Shukra Gochar 2024: వృశ్చిక రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారికి కోరికల వృద్ధి!

| Edited By: Janardhan Veluru

Oct 07, 2024 | 1:26 PM

ఈ నెల 13 నుంచి నవంబర్ 6 వరకు శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి శుక్రుడు వ్యామోహాలను, కోరికలను, ఆశలను పెంచుతాడు. అధికార దాహం, ధన దాహం కట్టలు తెంచుకుంటాయి. స్త్రీ వ్యామోహం కూడా వృద్ధి చెందుతుంది. రహస్య కార్యకలాపాలకు అవకాశం ఉంటుంది. ఆదాయాన్ని రహస్యంగా మదుపు చేసే అవకాశం కూడా ఉంటుంది.

Shukra Gochar 2024: వృశ్చిక రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారికి కోరికల వృద్ధి!
Shukra Gochar 2024
Follow us on

ఈ నెల 13 నుంచి నవంబర్ 6 వరకు శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి శుక్రుడు వ్యామోహాలను, కోరికలను, ఆశలను పెంచుతాడు. అధికార దాహం, ధన దాహం కట్టలు తెంచుకుంటాయి. స్త్రీ వ్యామోహం కూడా వృద్ధి చెందుతుంది. రహస్య కార్యకలాపాలకు అవకాశం ఉంటుంది. ఆదాయాన్ని రహస్యంగా మదుపు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆత్మ విశ్వాసం, మొండి పట్టుదల, గుండె ధైర్యం కాస్తంత ఎక్కువగా ఉంటాయి. అయితే, ఈ లక్షణాలన్నీ ప్రస్తుతానికి వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశు లకు మాత్రమే వర్తించడం జరుగుతుంది.

  1. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు సప్తమ స్థానమైన వృశ్చికంలో ప్రవేశించడం వల్ల విపరీతంగా ధన దాహం పెరుగుతుంది. యాంబిషన్ కు హద్దులుండవు. ఎంత శ్రమకైనా ఓర్చి డబ్బు సంపాదించడం జరు గుతుంది. ఆర్థికంగా ఒక మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. షేర్లు, వడ్డీ వ్యాపారాలు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. ఏ రంగంలో ఉన్నప్పటికీ తమ ప్రతిభను, సమర్థతను నిరూ పించుకుంటారు. స్త్రీ వ్యామోహం బాగా పెరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో, అంటే ఆలోచనా స్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల సంపాదన మీద దృష్టి కేంద్రీకృతమవుతుంది. సొంత పనుల మీదా, వ్యక్తిగత పురోగతి మీదా శ్రద్ధ పెరుగుతుంది. ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. అనేక విధాలుగా సంపాదించే ప్రయత్నం చేసి, సఫలం అవుతారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. శృంగార జీవితానికి, వ్యసనాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇంటికి అనేక కొత్త సౌకర్యాలను అమర్చుకుంటారు.
  3. సింహం: ఈ రాశికి చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతోషాల స్థానంలో, శుక్రుడి ప్రవేశం వల్ల జీవన శైలిని మార్చుకునే ప్రయత్నాలు జరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయ అవకాశాలను బాగా పెంచు కుంటారు. ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే తపన పెరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యో న్యత పెరుగుతుంది. శృంగార జీవితానికి, వ్యసనాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
  4. తుల: ఈ రాశి అధిపతి శుక్రుడు ధన స్థానమైన వృశ్చికంలో ప్రవేశించడం వల్ల అత్యధికంగా ధనం సంపాదించి కూడబెట్టడమే లక్ష్యంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనేక విధాలుగా ఆదాయం గడించడానికి అవకాశం ఉంది. విలాస జీవితానికి అలవాటు పడతారు. జీవిత భాగ స్వామితో అన్యోన్యత పెరుగుతుంది. అదే సమయంలో అక్రమ సంబంధాలకు, రహస్య వ్యవహారా లకు కూడా అవకాశం ఉంటుంది. సిరిసంపదల వృద్ధితో పాటు భోగభాగ్యాలు కూడా వృద్ధి చెందుతాయి.
  5. వృశ్చికం: ఈ రాశిలో శుక్రుడి ప్రవేశం వల్ల ఆదాయాన్ని బాగా పెంచుకోవడం మీద దృష్టి కేంద్రీకృతమవు తుంది. పట్టుదలగా ఆదాయ వృద్ధికి ప్రయత్నించి సఫలం అవుతారు. విలాసాల మీద ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. రహస్య కార్యకలాపాలకు ఎక్కువగా అవకాశం ఉంది. వ్యసనాల మీద ఖర్చు పెరుగుతుంది. షేర్లు, వడ్డీ వ్యాపారాలు, లావా దేవీల వల్ల ఆర్థిక లాభం ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో అనవసర పరిచయాలు పెరుగుతాయి.
  6. మకరం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల ఆర్థిక లాభాల మీద దృష్టి సారించడం జరుగుతుంది. డబ్బు సంపాదన విషయంలో ఎంతటి రిస్కుకైనా సిద్ధపడతారు. లాభదాయక పరిచయా లతో పాటు అనవసర పరిచయాలకు కూడా బాగా అవకాశం ఉంది. వడ్డీ వ్యాపారాలు, షేర్లు, మద్య వ్యాపారం, రియల్ ఎస్టేట్ వంటి రంగాల వారు బాగా రాణించి ఆర్థిక లక్ష్యాలను చేరుకుం టారు. దాంపత్య జీవితం బాగా అనుకూలంగా మారుతుంది. ఆశించిన స్థాయి ఆదాయ వృద్ధి ఉంటుంది.