Shukra Gochar 2023
ఈ నెల 3వ తేదీ నుంచి కన్యారాశిలో ప్రవేశిస్తున్న శుక్ర గ్రహం ఆ రాశిలో నీచబడడం జరుగుతుంది. నీచత్వం పొందిన శుక్ర గ్రహం ఈ నెల 29 వరకూ కన్యారాశిలోనే కొనసాగుతుంది. వాస్తవానికి గురువు తర్వాత అంతటి శుభ గ్రహమైన శుక్రుడు నీచబడడం వల్ల కొన్ని రాశుల వారికి తప్పకుండా సుఖసంతోషాలు దూరం అవుతాయి. అయితే, ఇందులో ఆరు రాశులకు మాత్రం శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. అవిః వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, మకరం, మీనం. ఈ రాశుల వారికి శుక్రుడు కేంద్ర (4,7,10), కోణ (1,5,9) రాశుల్లోకి రావడం శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశినాథుడైన శుక్రుడు పంచమ స్థానంలో సంచరించడం వల్ల అనేక విధాలుగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారి తెలివితేటలు, నైపుణ్యాలు అధికారులకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం, గుర్తింపులు తెచ్చుకోవడం జరుగుతుంది. అంతేకాక, ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
- మిథునం: ఈ రాశికి శుక్రుడు చతుర్థ స్థానంలో ప్రవేశించినందువల్ల ఈ గ్రహానికి దిగ్బలం ఏర్పడుతుంది. నీచ భంగం జరుగుతుంది. దీనివల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. అధికారులు ఎక్కు వగా ఆధారపడే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. నిరుద్యోగు లకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. గృహ, వాహన యోగాలు పట్టవచ్చు.
- కన్య: ఈ రాశికి ఆధిపత్యం రీత్యా అత్యంత శుభుడైన శుక్రుడు ఈ రాశిలో నీచబడినప్పటికీ, శుభ ఫలితాలే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదాయానికి లోటుండదు. తరచూ, ఏదో ఒక కారణంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అవసర సమయాల్లో ఆర్థిక సహాయం అందుతుంది. తల్లితండ్రులు లేదా సోదరుల అండదండలు కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలుంటాయి. సర్వత్రా మాట చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా, ఒత్తిడి లేని విధంగా ఉండడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యాలకు అవకాశం ఉండదు.
- ధనుస్సు: ఈ రాశివారికి దశమ స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి నిల కడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒకటికి మించి ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పనిసరిగా క్రమబద్ధమైన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ప్రత్యేక మైన గుర్తింపు ఏర్పడుతుంది. సతీమణికి కూడా వృత్తి, ఉద్యోగాల్లో మంచి యోగం పట్టే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఈ రాశివారికి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
- మకరం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల, ఏదో ఒక మార్గంలో ఆదాయం కలిసి వస్తూ ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి రావడం గానీ, తండ్రి కారణంగా ఆస్తి వివాదం పరిష్కారం కావడం గానీ జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు శుభవార్త అందుకుంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న సతీమణికి అంచనాలకు మించి జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. శుభవార్తలు వినడంతో పాటు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- మీనం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం నిశ్చయం కావడం, సతీమణి వల్ల ఆస్తి కలసి రావడం, సతీమణి వల్ల అదృష్టం పట్టడం వంటివి తప్పకుండా జరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ఊపందుకుంటాయి. భాగస్వాములతో విభే దాలు తొలగిపోతాయి. అనుకోకుండా దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం పొందడం జరుగు తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం పెర గడం, ఆర్థిక స్థిరత్వం ఏర్పడడం వంటివి జరుగుతాయి. విలాసవంతమైన జీవితం ఏర్పడుతుంది.
(Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..