Zodiac Signs: శుభ గ్రహాల పరస్పర వీక్షణ.. ఆ రాశుల వారి జీవితాల్లో శుభాలు పక్కా..!

| Edited By: Janardhan Veluru

Oct 09, 2024 | 7:09 PM

ఈ నెల 13 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్న సమయంలో వృషభ రాశిలో ఉన్న గురువుతో సమ సప్తక దృష్టి, అంటే పరస్పర వీక్షణ ఏర్పడుతుంది. ఈ రెండు శుభ గ్రహాల పరస్పర వీక్షణ వల్ల అయిదు రాశుల వారి జీవితాల్లో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

Zodiac Signs: శుభ గ్రహాల పరస్పర వీక్షణ.. ఆ రాశుల వారి జీవితాల్లో శుభాలు పక్కా..!
Zodiac Signs
Follow us on

ఈ నెల 13 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్న సమయంలో వృషభ రాశిలో ఉన్న గురువుతో సమ సప్తక దృష్టి, అంటే పరస్పర వీక్షణ ఏర్పడుతుంది. ఈ రెండు శుభ గ్రహాల పరస్పర వీక్షణ వల్ల అయిదు రాశుల వారి జీవితాల్లో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇందులో గురువు ధన కారకుడు, శుక్రుడు సుఖ సంతోషాలకు కారకుడు అయినందువల్ల ధన, సుఖ సంతోషాలకు లోటుండదు. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశుల వారు ఈ శుభ గ్రహాల పరస్పర వీక్షణ వల్ల ప్రయోజనం పొందడం జరుగుతుంది.

  1. వృషభం: ఈ రాశిలో ఉన్న గురువుతో సప్తమంలో ఉన్న శుక్రుడికి పరస్పర వీక్షణ ఏర్పడుతున్నందువల్ల జీవితంలో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇందులో శుక్రుడు రాశ్యధిపతి అయినందు వల్ల ఈ గ్రహంపై గురువు దృష్టి తప్పకుండా అనేక శుభ ఫలితా లను ఇస్తుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం విశేషంగా పెరుగుతుంది. అనుకోని మార్గాల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. సంపన్న కుటుంబంలో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది.
  2. కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో గురువు సంచారం చేస్తూ ఒకరినొకరు వీక్షిం చుకోవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనూ, కుటుంబ జీవితంలోనూ కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విలాసవంతమైన జీవితం అలవడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరు గుతుంది. ఇతరులకు మేలు జరిగే కార్యక్రమాలు చేపడతారు. మనసులోని కోరికలు నెరవేరు తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి.
  3. సింహం: ఈ రాశికి దశమంలో సంచారం చేస్తున్న గురువుతో చతుర్థ శుక్రుడికి పరస్పర దృష్టి ఏర్పడినం దువల్ల ఉద్యోగపరంగా కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగుల పంట పండుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాలపరంగా పురోగమించడం ప్రారంభం అవుతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.
  4. వృశ్చికం: ఈ రాశిలో ప్రవేశించిన శుక్రుడితో సప్తమంలో ఉన్న గురువుకు దృష్టి ఏర్పడినందువల్ల ఏ ప్రయ త్నమైనా విజయవంతం అవుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. పట్టిం దల్లా బంగారం అవుతుంది. సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. జీవనశైలి మారిపోతుంది.
  5. మకరం: ఈ రాశికి లాభస్థానంలో ఉన్న శుక్రుడితో పంచమ స్థానంలో ఉన్న గురువుకు మంచి వీక్షణ ఏర్ప డినందువల్ల ఆదాయపరంగా అనేక శుభవార్తలు వినడం, ఆస్తుల విలువ పెరగడం, ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.