Janmashtami: ఈ ఏడాది జన్మాష్టమి రోజున అరుదైన 3 యోగాలు.. ఎవరికి ప్రయోజనం కలుగుతుందంటే

|

Aug 26, 2024 | 3:08 PM

ఈ జన్మాష్టమి నాడు ఒకటి కాదు రెండు కాదు మొత్తం 3 అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి.. అవును ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అనేక అరుదైన యోగాలు రూపొందుతున్నాయి. ద్వారప యుగం నాటి సమయంలో చంద్రోదయం జరుగుతుంది. కనుక ఈ యోగాలన్నీ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రతి రాశి వారికి ఫలవంతంగా ఉంటాయి. ఈ అరుదైన యోగంలో శ్రీ కృష్ణుడిని పూజించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

Janmashtami: ఈ ఏడాది జన్మాష్టమి రోజున అరుదైన 3 యోగాలు.. ఎవరికి ప్రయోజనం కలుగుతుందంటే
Janmashtami
Follow us on

శ్రీ కృష్ణ జన్మాష్టమి సంబరాలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. బృందావనం, మధురలో సహా అనేక ప్రాంతాల్లో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తుంది. భారతదేశంలోనే కాదు, విదేశాలలో కూడా కృష్ణుడుకి భక్తులు ఉన్నారు. అందుకనే మన దేశంతో పాటు విదేశాలలోని కన్నయ్య భక్తులు ఈ రోజును చాలా వైభవంగా వేడుకలను జరుపుకుంటారు. ఈసారి జన్మాష్టమి సందర్భంగా ఎన్నో మేలు, ఫలప్రదమైన యోగాలు రూపొందాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ యోగాలు ఒకటి కాదు రెండు కాదు ఒకే రోజు మొత్తం మూడు యోగాలు ఏర్పడ్డాయి. ఈ మూడు యోగాలు ఫలితాలను అందించడానికి వేటికి అవే సొంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏర్పడిన ఈ మూడు యోగాల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం.

ద్వాపర యుగ సమయంలో

ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి తిధి ద్వాపర యుగం నాటి అరుదైన యాదృచ్ఛికం ఏర్పడనున్నదని ఈ కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మధురలో చంద్రోదయ సమయం రాత్రి 11.24 అని చెబుతారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు 5251వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాడు. మనం ద్వాపర యుగం నాటి సమయం గురించి మాట్లాడినట్లయితే శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని రోహిణి నక్షత్రంలోని నిశీధి సమయంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. మథురలో కంసుని జైలులో జన్మించాడు. ఆ సమయంలో ద్వాపర యుగంలో ఇలాంటి యోగాలు ఏర్పడ్డాయి. అటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రోజున ఏర్పనుంది. కనుక ఈ సమయానికి మరింత ప్రాముఖ్యత మరింత పెరిగింది. చాలా పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

చంద్రుడితో కూడా ప్రత్యేక అనుబంధం ఉంది

ఈ సంవత్సరం జన్మాష్టమి రోజున చంద్రుడు వృషభరాశిలో రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ద్వాపరయుగంలో కృష్ణుని జన్మ సమయంలో ఇదే కలయిక కనిపించింది. ఈ సమయంలో శశరాజ యోగం, గజకేసరి యోగం, సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతున్నాయి. అంతేకాదు ఈసారి జన్మాష్టమి చంద్రవారంలో వచ్చింది. అంటే ఈసారి జన్మాష్టమి సోమవారం వస్తోంది. చంద్రుడు శ్రీ కృష్ణుని పుట్టుకతో లోతైన సంబంధాన్ని కలిగి ఉన్నాడని భావిస్తారు. కృష్ణుడు ఈ భూమిపై జన్మించినప్పుడు ఆ సమయంలో చంద్రుడు కూడా ఆకాశంలో ఉదయించినట్లు భావిస్తారు. కృష్ణుడికి మొత్తం 16 కళలు ఉన్నాయి. చంద్రునికి కూడా 16 దశలు ఉన్నాయి. అందువల్ల ఈ యోగా కూడా ప్రయోజనకరమే.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు