Lord Shani: శనివారం పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి.. లేకుంటే భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది

|

Dec 16, 2023 | 2:32 PM

జ్యోతిష్యం ప్రకారం శనివారం రోజున కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయడం మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతారు. ఎందుకంటే అలా చేయడం అశుభ పరిణామాలకు దారి తీస్తుంది. శనీశ్వరుడి గురించి ఆధ్యాత్మికత గ్రంథాల్లో, పురాణాల్లో ప్రస్తావించబడింది. శనివారం పొరపాటున కూడా ఎవరూ బూట్లు లేదా చెప్పులు కొనకూడదని నమ్ముతారు. దీంతో శనిదేవుడికి కోపం వస్తుంది. అదే సమయంలో మీరు అవసరమైన వ్యక్తికి బూట్లు లేదా చెప్పులను ఇస్తే.. శనీశ్వరుడి ఆశీర్వాదం అతనిపై ఉంటాయని విశ్వాసం. 

Lord Shani: శనివారం పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి.. లేకుంటే భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది
Shani Dev
Follow us on

సనాతన ధర్మంలో శనీశ్వరుడుకి శనివారం అంకితం చేయబడింది. శనివారం.. భక్తులకు చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి, అతని కోపాన్ని నివారించడానికి భక్తులు శనివారం అనేక చర్యలు తీసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిగ్రహాన్ని క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. జాతకంలో శని దోషం ఉన్నా.. ఎవరిపైన అయినా శనీశ్వరుడికి కోపం వచ్చినా ఎన్నో సమస్యలు సృష్టిస్తాడు.

జ్యోతిష్యం ప్రకారం శనివారం రోజున కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయడం మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతారు. ఎందుకంటే అలా చేయడం అశుభ పరిణామాలకు దారి తీస్తుంది. శనీశ్వరుడి గురించి ఆధ్యాత్మికత గ్రంథాల్లో, పురాణాల్లో ప్రస్తావించబడింది. శనివారం పొరపాటున కూడా ఎవరూ బూట్లు లేదా చెప్పులు కొనకూడదని నమ్ముతారు. దీంతో శనిదేవుడికి కోపం వస్తుంది. అదే సమయంలో మీరు అవసరమైన వ్యక్తికి బూట్లు లేదా చెప్పులను ఇస్తే.. శనీశ్వరుడి ఆశీర్వాదం అతనిపై ఉంటాయని విశ్వాసం.

శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..

  1. హిందూ గ్రంధాల ప్రకారం శనీశ్వరుడు చెడు ద్రుష్టితో ఉంటే సాధారణ పూజలు చేస్తేనే అనుగ్రహము కలుగుతుందని విశ్వాసం. అటువంటి పరిస్థితిలో శనివారం భాగస్వామితో సంబంధానికి దూరంగా ఉండండి..  ఇలా చేస్తే అశుభంగా పరిగణిస్తారు.
  2. జ్యోతిష్య శాస్త్రంలో శనివారం శనీశ్వరుడికి ఆవనూనె నైవేద్యంగా పెట్టే సంప్రదాయం ఉంది. అయితే పొరపాటున కూడా శనివారం నూనె కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఆ రోజున ఆవాల నూనెను కొనుగోలు చేయడం వలన వ్యాధి బారిన పడతారని విశ్వాసం.
  3. ఇవి కూడా చదవండి
  4. హిందూ సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం శనివారం ఉప్పు కొనుగోలు చేయవద్దు. శనివారం ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఇంట్లోని సభ్యులు అప్పులు పాలవుతారని విశ్వాసం. అంతేకాదు ఆ ఇంట్లోని వారి ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎవరైనా ఉప్పు కొనవలసి వస్తే శనివారం కొనకూడదు. మరొక రోజు కొనాలి. లేకపోతే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
  5. శనివారం పొరపాటున కూడా బొగ్గు కొనుగోలు చేయవద్దు.  శనివారం బొగ్గును కొనుగోలు చేయడం అశుభం. ఈ రోజున బొగ్గును కొనుగోలు చేస్తే శనీశ్వరుడు ఆగ్రహానికి గురవుతారని విశ్వాసం. జీవితంలో పురోగతిలో అనేక అడ్డంకులను సృష్టిస్తుందని చెప్పబడింది.
  6. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం లైంగిక కోరికలకు శుక్రుడు బాధ్యత వహిస్తాడు. అదే విధంగా శనీశ్వరుడు ఆధ్యాత్మికతను, సత్యాన్ని పెంపొందించే గ్రహం కనుక శనివారం పాలు తీసుకోవద్దు. ఒకవేళ పాలు తాగాల్సి వస్తే అందులో పసుపు వేసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు