
జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉన్నా.. శనీశ్వరుడి స్థానం మాత్రం వెరీ వెరీ స్పెషల్. శనీశ్వరుడికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చాలా మందికి మనసులో శనీశ్వరుడి పట్ల భయం ఉంటుంది. కర్మ ఫలాలను అందించే శని దేవుడు జులై నెలలో తిరోగమనం చెందుతాడు. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న శనీశ్వరుడు మీనరాశిలో తిరోగమనం చెందడం వలన ఈ ప్రభావం అన్ని రాశుల వారిపై చూపిస్తుంది. అయితే ఈ తిరోగమన కదలిక కొన్ని రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈసారి జూలైలో శనీశ్వరుడు తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. కనుక శని దేవుని ఈ తిరోగమన కదలిక వల్ల ఏ రాశుల వారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
శని దేవుడు ఎప్పుడు మారుతాడు?
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శనిదేవుడు జూలై 13న ఉదయం 7:24 గంటలకు మీన రాశిలో తిరోగమనం చెందనున్నాడు. నవంబర్ 28, 2025న ఉదయం 7:26 గంటలకు ప్రత్యక్షంగా మారుతాడు. అటువంటి పరిస్థితిలో, శనీశ్వరుడు దాదాపు 138 రోజులు తిరోగమనంలో కదులుతాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారిపై శనిశ్వరుడి కరుణ అపారం. ఈ రాశుల వారికి విజయం లభిస్తుంది.
వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు శనిశ్వరుడి తిరోగమన కదలిక వలన అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సమయంలో వృషభ రాశి వారి పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. వ్యాపారం చేసే వారు మంచి లాభాలను పొందవచ్చు. మీరు ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. అనే పనులకు ఇదే మంచి సమయం. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతం పెరుగుదల ఉండవచ్చు. మీరు పని కోసం ప్రయాణించాల్సి రావచ్చు, ఇది ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని పూర్తవుతుంది. అంతేకాదు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న డబ్బు కూడా అందుతుంది.
మిథున రాశి: ఈ రాశి వారి జాతకంలో పదవ ఇంట్లో శని తిరోగమనంలో ఉంటాడు. ఈ సమయంలో, ఈ రాశికి చెందిన వ్యక్తులు ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలో విజయం సాధిస్తారు. అదృష్టం వీరి వైపు ఉంటుంది. దీంతో వీరు ఏ పని మొదలు పెట్టినా ఆ పనులలో విజయం సాధిస్తారు. ఆస్తి కొనాలనే కోరిక నెరవేరవచ్చు. అలాగే ఏదైనా ప్రభుత్వ పథకం నుంచి ప్రయోజనం పొందుతారు.
కన్య రాశి: కన్య రాశి ఏడవ ఇంట్లో శని తిరోగమనంలో ఉండబోతున్నాడు. అటువంటి పరిస్థితిలో శనిశ్వరుడి తిరోగమన కదలిక ఈ రాశి వారికి చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ కుటుంబ సబ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. ఈ కాలంలో వ్యాపారం చేసే వారు మంచి లాభాలను ఆర్జించవచ్చు. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. తమ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఇంట్లో ఆనందం, శాంతి , సంపద ఉంటాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.