AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: శనీశ్వరుడి తిరోగమనంలో ఈ 5 రాశులవారికి ఇబ్బందులు.. నివారణ కోసం ఈ సింపుల్ చిట్కాలు పాటించండి

శనీశ్వరుడు మకరరాశిలో ప్రవేశించే సమయంలో కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం మకర, కుంభ, మీన రాశుల్లో శనీశ్వర ప్రభావం కొనసాగుతోంది. ఈ రాశుల వారికి వచ్చే ఒక నెల కాస్త కష్టంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొంటుంది.

Zodiac Signs: శనీశ్వరుడి తిరోగమనంలో ఈ 5 రాశులవారికి ఇబ్బందులు.. నివారణ కోసం ఈ సింపుల్ చిట్కాలు పాటించండి
Shani Vakri Gochar
Surya Kala
|

Updated on: Jun 04, 2022 | 9:34 PM

Share

Zodiac Signs: ఆదిదేవుడు సూర్యుని తనయుడు శనీశ్వరుడు(shaniswara) రేపటి (జూన్ 5) నుండి తిరోగమనం చేయబోతున్నాడు. దీంతో శనీశ్వరుడు కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు లాభాన్ని ఇస్తాడు.. మరికొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు ఇబ్బందిని సృష్టించవచ్చు. రేపటి నుంచి శనీశ్వరుడు 141 రోజుల పాటు తిరోగమన దిశలో కదలనున్నాడు. ఏప్రిల్ 29  2022న శని రాశిలో మార్పులు చోటు చేసుకున్నాయి. శని తన సొంత రాశి అయిన కుంభరాశికి చేరుకున్నాడు. తిరోగమన సమయంలో, శని మళ్లీ  జూలై 12న మకరరాశిలోకి  ప్రవేశించనున్నాడు. 17 జనవరి 2023 వరకు ఈ రాశిలో ఉంటాడు. దీని తర్వాత మళ్లీ కుంభరాశికి చేరుకుంటాడు. మకరరాశిలో ప్రవేశించే సమయంలో కొన్ని రాశులపై  తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం మకర, కుంభ, మీన రాశుల్లో శనీశ్వర ప్రభావం కొనసాగుతోంది. ఈ రాశుల వారికి వచ్చే ఒక నెల కాస్త కష్టంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ  సమస్యలను తగ్గించమని శనీశ్వరుడిని ప్రార్ధిస్తూ.. కొన్ని నివారణ చర్యలు పాటించాలి. అవి ఏమిటో చూద్దాం..

శనీశ్వర ప్రభావం గల రాశికి చెందిన వ్యక్తులు శివుడిని పూజించాలి. నల్ల నువ్వుల నైవేద్యంగా సమర్పించాలి. లింగానికి నీటితో అభిషేకం చేయాలి.

పేదలకు దానం చేయండి. ఆర్ధిక శక్తిని అనుసరించి నిరుపేదలకు సహాయం చేయండి. ఏ నిస్సహాయ వ్యక్తిని వేధించవద్దు.. ఇలా చేయడం శనీశ్వరుడికి కోపం తెప్పిస్తుంది.

కుక్కలకు రొట్టెలను ఆహారంగా అందించండి. నల్లటి కుక్కకు రోటీలో ఆవనూనె కలిపి ఆహారంగా ఇవ్వండి.

శనివారం నాడు.. ఒక పాత్రలో ఆవాల నూనె పోసి అందులో మీ ప్రతిబింబాన్ని చూసి.. అనంతరం ఆ నూనెను దానం చేయండి.

శనివారం సాయంత్రం రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించండి . అలాగే శనీశ్వరుడికి, హనుమంతుడికి దీపం వెలిగించండి.

క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించండి. శని చాలీసా, శని మంత్రాలను జపించండి.

శనికి కోపం తెప్పించే ఎలాంటి తప్పుడు పనులు చేయకండి. కర్మలను సక్రమంగా నిర్వహించే వారిని శనీశ్వరుడు ఎప్పటికీ బాధించడు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)