Shani Shukra Yuti: మిథున రాశిలో నవపంచమ యోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమయమే..

|

Jun 01, 2023 | 3:23 PM

Navpanchama Rajyog: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు నిర్ధిష్ట కాలంలో తమ రాశి, నక్షత్రాలను మారుస్తుంటాయి. అలా గ్రహాలు తమ స్థితిగతులను మార్చడం రాశిచక్రంలోని 12 రాశులవారికి శుభ, అశుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈ క్రమంలోనే శుక్ర, శని గ్రహాలు మే 6న కలిసి..

Shani Shukra Yuti: మిథున రాశిలో నవపంచమ యోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమయమే..
Navpancham Rajyog 2023
Follow us on

Navpanchama Rajyog: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు నిర్ధిష్ట కాలంలో తమ రాశి, నక్షత్రాలను మారుస్తుంటాయి. అలా గ్రహాలు తమ స్థితిగతులను మార్చడం రాశిచక్రంలోని 12 రాశులవారికి శుభ, అశుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈ క్రమంలోనే శుక్ర, శని గ్రహాలు మే 6న కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరిచాయి. ఈ రాజయోగం రాశిచక్రంలోని 3 రాశులవారికి అనేక శుభఫలితాలను చేకూరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమయం ఆయా రాశులవారికి మహర్దశగా, పట్టిందల్లా బంగారంగా మారేలా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ అదృష్ట రాశులేమిటో ఇప్పుడు చూద్దాం..

మిధునరాశి: మిథునరాశి జాతకులకు నవపంచం రాజయోగం ఎంతో శుభప్రదం. ఈ సమయంలో మిథున రాశివారు ప్రతి పనిలో అదృష్టం కలిగి ఉండడంతో పాటు వారి కోరికలన్నీ తీరుతాయి. ఇంకా మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరగడమే కాక కుటుంబంతో ప్రశాంతమైన సమయాన్ని గడుపుతారు.

సింహరాశి: సింహరాశి వారికి కూడా నవపంచం రాజయోగం చాలా లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో మీ సంపదలు రెట్టింపు అవుతాయి. ఇంకా మీకు సంబంధించిన పెండింగ్ పనులు అన్ని పూర్తవడంతో పాటు మీకు గౌరవ మర్యాదలు అనూహ్యంగా పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి: నవపంచం రాజయోగం వృషభరాశివారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాజయోగం సమయంలో వృషభరాశి 10వ పాదంలో శని దేవుడు ఉన్నాడు. అందువల్ల మీకు ఆకస్మిక లాభం, రెట్టింపు గౌరవం, పనిలో విజయం కలుగుతాయి. మీకు ఉద్యోగ ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..