Shravana Masam: ఏలి నాటి శనితో ఇబ్బంది పడుతున్నారా.. శనీశ్వరుడి అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో శివయ్యని ఇలా పూజించండి..

|

Jul 18, 2024 | 10:23 AM

జ్యోతిషశాస్త్రంలో శనిశ్వరుడిని న్యాయ దేవుడు , మోక్ష ప్రదాత అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం శనిశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు. మార్చి 29, 2025 వరకు ఈ రాశిలో ఉంటాడు. ఆ రోజున శనిశ్వరుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేసిస్తాడు. జ్యోతిష్యుల ప్రకారం దేవ దేవుడైన మహాదేవుని పూజించడం ద్వారా ఏలి నాటి శని ప్రభావం తొలగిపోతుంది. అటువంటి పరిస్థితిలో ఎవరైనా ఏలి నాటి శనితో బాధపడుతున్నట్లయితే, శ్రావణ మాసంలోని సోమవారం నాడు ఈ వస్తువులతో శివయ్యకు అభిషేకం చేయవచ్చు.

Shravana Masam: ఏలి నాటి శనితో ఇబ్బంది పడుతున్నారా.. శనీశ్వరుడి అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో శివయ్యని ఇలా పూజించండి..
Shani Sade Sati Puja Tips
Follow us on

హిందూ మతంలో ప్రతి నెల ఏదో ఒక దేవుడి ఆరాధనకు అంకితం చేయబడింది. అదేవిధంగా శ్రావణ మాసం పూజల మాసం. పండగలు, పర్వదినాలు, శుభకార్యాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శివుడు, వరలక్ష్మి, మంగళ గౌరిదేవిలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. జ్యోతిషశాస్త్రంలో శనిశ్వరుడిని న్యాయ దేవుడు , మోక్ష ప్రదాత అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం శనిశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు. మార్చి 29, 2025 వరకు ఈ రాశిలో ఉంటాడు. ఆ రోజున శనిశ్వరుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేసిస్తాడు. జ్యోతిష్యుల ప్రకారం దేవ దేవుడైన మహాదేవుని పూజించడం ద్వారా ఏలి నాటి శని ప్రభావం తొలగిపోతుంది. అటువంటి పరిస్థితిలో ఎవరైనా ఏలి నాటి శనితో బాధపడుతున్నట్లయితే, శ్రావణ మాసంలోని సోమవారం నాడు ఈ వస్తువులతో శివయ్యకు అభిషేకం చేయవచ్చు.

ఏలి నాటి శని 2024 నివారణలు ఏమిటంటే?

  1. సృష్టి లయకారుడైన శివుడుడిని కర్మ ఫలదాత శనీశ్వరుడు పూజిస్తాడు. శివుడు ఇచ్చిన వరం వల్లనే శనీశ్వరుడికి న్యాయాధిపతిగా కర్మ ఫలదాత హక్కు లభించింది. కనుక శివుడిని పూజిస్తే శనీశ్వరుడు త్వరగా ప్రసన్నుడవుతాడు. శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ సోమవారం రోజున స్నానం, ధ్యానం తర్వాత, గంగాజలంలో నల్ల నువ్వులను కలిపి శివునికి అభిషేకం చేయండి. అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి.
  2. ఏలి నాటి శని నుంచి విముక్తి పొందడానికి, రోజూ స్నానం చేసి శివయ్యను ధ్యానం చేయండి. తర్వాత బిల్వ పాత్రలను గంగాజలంలో కలిపి ఈ జలంతో శివాలయంలోని శివలింగానికి అభిషేకం చేయండి. ఈ పూజ ముగింపు సమయంలో ఏలి నాటి శని నుంచి విముక్తి కోసం శివయ్యను ప్రార్థించండి.
  3. శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే శ్రావణ సోమవారం రోజున గంగాజలంతో వునికి అభిషేకం చేయండి. ఈ రెమెడీని అనుసరించడం ద్వారా ఏలి నాటి శని నుండి కూడా బయటపడవచ్చు.
  4. ఎవరికైనా ధనలాభం కలగాలనుకున్నా లేదా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించాలన్నా శ్రావణ మాసంలో ప్రతిరోజూ మహాదేవుడికి చెరుకు రసంతో అభిషేకం చేయండి. ఈ రెమెడీని అనుసరించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. మీరు సంకట మోచన హనుమంతుడిని అనుగ్రహం కోసం శ్రావణ సోమవారం రోజున శివునికి తేనెతో అభిషేకం చేయండి. ఈ పరిహారం చేయడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం వ్యక్తిపై కురుస్తుంది శివుడి అనుగ్రహంతో ఏలి నాటి శని ప్రభావం తొలగిపోతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు