ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే మంచి చెడులకు కారణం జాతకంలో గ్రహాలు, నక్షత్రాలు కారణం అని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. గ్రహాలు సంచారం ఆధారంగా మానవ జీవితం ఆధారపడి ఉంటుందని విశ్వాసం. అయితే నవ గ్రహాలకు అధిపతి సూర్యుడు. కర్మల ప్రధాత శనీశ్వరుడు కూడా నవగ్రహాల్లో ఒక గ్రహం. పురాణాల ప్రకారం సూర్యుడి తనయుడు శనీశ్వరుడు. మనిషి చేసే కర్మలను బట్టి ఫలాలను ఇచ్చే శనీశ్వరుడు అంటే సర్వసాధారంగా అందరికీ భయమే.. అయితే వాస్తవానికి శనీశ్వరుని అనుగ్రహం ఎవరిపైనా ఉంటే వారు కూటికి లేని వాడు అయినా కోటీశ్వరుడు అవుతాడు. అదే సమయంలో ఎవరిపైన అయినా శనీశ్వరుడి దృష్టి వక్రంగా పడితే కోట్లకు పడగలెత్తిన వాడైనా కూటికి లేనివాడిగా మారిపోతాడు. నవ గ్రహాల్లో శనీశ్వరుడు అతి నెమ్మదిగా నడిచే గ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ కర్మఫలదాత త్వరలో నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు.
ప్రస్తుతం శతభిషా నక్షత్రంలో ఉన్న శనీశ్వరుడు ఏప్రిల్ 07న పూర్వా భాద్రపద నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. అయితే ఈ పూర్వాభాద్రపద నక్షత్రానికి అధిపతి దేవ గురువు.. బృహస్పతి. ఈ నేపథ్యంలో శనిశ్వరుడు నక్షత్రాన్ని మార్చుకోనుండడం వలన కొన్ని రాశులకు చెందిన వారి జీవితాలు మారనున్నాయి. దీంతో ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..
వృషభరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో శనీశ్వరుడు నక్షత్ర మార్పు అనేక శుభాలను ఇస్తుంది. కోరిన కోర్కెలు తీరతాయి. ఉద్యోగ కోసం ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమస్యలు తీరతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి.
మిథున రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో శనీశ్వరుడు నక్షత్రంలో మార్పు అద్భుతంగా ఉండనుంది. ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న స్టూడెంట్స్ కు అనుకూల ఫలితాలను ఇస్తాడు. చదువు, వ్యాపార రంగంలో రాణిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
మేష రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో శనీశ్వరుడు అనుగ్రహంతో సమాజంలో మంచి స్టేజ్ కు చేరుకున్నారు. కెరీర్ లో సక్సెస్ అందుకుంటారు. జీవితంలో సరికొత్త బాటలో పయనించే ప్రయత్నం చేస్తారు. వివాహం కోసం చూస్తున్న వారు శుభ వార్త వింటారు. ఆర్ధికంగా అన్ని విధాలా లాభాలు పొందుతారు. సంతానం లేని దంపతులకు శుభవార్త వింటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు