AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్య రాశి సెప్టెంబర్ మాసఫలాలు 2026: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు

సెప్టెంబర్ నెల కన్య రాశి వారికి శుభ ఫలితాలను అందించే అవకాశం ఉంది. ధన స్థానంలో శుక్రుడు, లాభ స్థానంలో గురువు, ద్వితీయార్థంలో లాభ స్థానంలో కుజుడి సంచారంతో జీవితంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. ఆదాయం మెరుగుపడి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో తెలివితేటలు, శక్తిసామర్థ్యాలతో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు.

కన్య రాశి సెప్టెంబర్ మాసఫలాలు 2026: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
6 Kanya Rashi September 2026 Horoscope
Janardhan Veluru
|

Updated on: Aug 31, 2026 | 4:44 PM

Share

కన్య (ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త 1, 2): సెప్టెంబర్ నెల కన్య రాశి వారికి అనేక శుభ ఫలితాలను అందించే అవకాశం ఉంది. ధన స్థానంలో ధనాధిపతి శుక్రుడు, లాభ స్థానంలో గురువు, నెల ద్వితీయార్థం నుంచి లాభ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల జీవితంలో మంచి మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శుభ పరిణామాలు ఎక్కువగా చోటుచేసుకునే అవకాశం ఉంది.

ఈ నెలలో ఆదాయం గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉండటంతో ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. అవసరమైన సమయంలో కొందరు మిత్రులకు ఆర్థిక సహాయం చేసే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి.

వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీ తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతూ క్రమంగా పురోగతి సాధించే అవకాశం ఉంది.

శుభకార్యాలు, దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. పిల్లలు ఆశించిన విధంగా అభివృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొని ఆనందంగా గడుపుతారు.

ఆధ్యాత్మికంగా దుర్గాదేవిని తరచూ ఆరాధించడం, సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల రాహు-కేతువుల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి.

Follow Us