Shubh Yoga: రాహువుపై కుజ దృష్టి…ఈ రాశుల వారికి విజయాలు ఖాయం!

Telugu Astrology: నవంబర్ 28 నుండి డిసెంబర్ 7 వరకు వృశ్చికంలోని కుజుడు కుంభంలోని రాహువుపై దృష్టి పెట్టనున్నాడు. ఈ అరుదైన గ్రహ సంచారం మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశులకు విశేష శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు, ఊహించని ధనలాభం, ఆస్తి యోగాలు, వైవాహిక సౌఖ్యం వంటి శుభ పరిణామాలు ఈ రాశివారి జీవితాల్లో కలగనున్నాయి.

Shubh Yoga: రాహువుపై కుజ దృష్టి...ఈ రాశుల వారికి విజయాలు ఖాయం!
Shubh Yogas

Edited By: Janardhan Veluru

Updated on: Oct 30, 2025 | 3:43 PM

Success Zodiac Signs: జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు ఏదైనా గ్రహంతో కలిసినా లేదా చూసినా ఆ గ్రహంలో వేగం పెరుగుతుంది. దీనివల్ల కొన్ని ఆకస్మిక పరిణామాలకు అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా పదోన్నతి లభించడం, హఠాత్తుగా ఆదాయం పెరగడం, ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 7 వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్న కుజుడి దృష్టి కుంభ రాశిలో ఉన్న రాహువు మీద పడింది. దీని ఫలితంగా మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి కొన్ని ముఖ్యమైన శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది.

  1. మేషం: లాభ స్థానంలో ఉన్న రాహువును రాశ్యధిపతి కుజుడు వీక్షించడం వల్ల ఊహించని విధంగా ఆదాయం వృద్ధి చెందడం, ఆదాయ మార్గాలు మారడం, ఆదాయావకాశాలు పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకోకుండా రాజీమార్గంలో పరిష్కారమై, బాగా లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు విశేషంగా లాభిస్తాయి. అనారోగ్యాలకు సరైన చికిత్స లభిస్తుంది. గృహ యోగం పడుతుంది.
  2. వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న రాహువును సప్తమ స్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.
  3. సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న రాహువును చతుర్థ స్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల కుటుంబ, దాంపత్య సమస్యలు, వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.
  4. తుల: పంచమ స్థానంలో ఉన్న రాహువును ధన స్థానంలో ఉన్న కుజుడు వీక్షించడం వల్ల షేర్లు, స్పెక్యు లేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో అదనపు ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది.
  5. వృశ్చికం: చతుర్థ స్థానంలో ఉన్న రాహువును రాశ్యధిపతి కుజుడు చూడడం వల్ల ఉద్యోగంలో హోదా పెరగడానికి, వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గి సుఖ సంతోషాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో మంచిపెళ్లి సంబంధం కుదురుతుంది.
  6. మకరం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న రాహువును లాభస్థానంలో ఉన్న కుజుడు చూడడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.