Money Astrology: రాహువు ఎఫెక్ట్.. ఈ రాశులకు ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ..!

కుంభరాశిలో శతభిష నక్షత్రంలో బలంగా సంచరిస్తున్న రాహువు ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ఖర్చులు, ఆర్థిక ఒత్తిడి, మోసాలు, నష్టాల అవకాశాలు పెరగవచ్చు. ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండి స్కంద స్తోత్రం పఠించడం శ్రేయస్కరం.

Money Astrology: రాహువు ఎఫెక్ట్.. ఈ రాశులకు ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ..!
Money Astrology

Edited By:

Updated on: Jul 16, 2026 | 7:10 PM

ఈ ఏడాది డిసెంబర్ 5 వరకు కుంభ రాశిలో సంచారం చేస్తున్న రాహువు ప్రస్తుతం తన సొంత నక్షత్రమైన శతభిషంలో కొనసాగుతున్నందువల్ల మరింత బలంగా, వేగంగా ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. వ్యయ కారకుడైన రాహువు బలపడుతున్నందు వల్ల కొన్ని రాశుల వారికి ఆదాయం కంటే ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక వ్యయాలు, అనుకోని ఖర్చులు, వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. మోసాలు, నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంది. మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు కాస్తంత అప్రమత్తంగా ఉండడం, ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ రాశులవారు స్కంద స్తోత్రం పఠించడం ఉత్తమం.

  1. మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల పిత్రార్జితాన్ని ఎక్కువ భాగం వృథా చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు, పర్యటనల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి కొద్దిగా స్థిరాస్తిని అమ్మే అవకాశం ఉంది. ఇతరులకు చేసే సహాయానికి ప్రతిఫలం ఉండకపోవచ్చు. ఇతరులకు ఇచ్చే డబ్బు ఒకపట్టాన తిరిగి రాకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిత్రుల వల్ల ధన నష్టం కలుగుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల ఆకస్మిక వ్యయాలు తప్పకపో వచ్చు. ఆదాయంలో ఎక్కువ భాగం విలాసాల మీద ఖర్చయ్యే అవకాశం ఉంది. కొందరు బంధు మిత్రుల వల్ల ఖర్చులు బాగా పెరగడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, సమస్యలు అనుకూలంగా పరిష్కారం కాకపోవచ్చు. అనారోగ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆస్పత్రుల్ని సందర్శించాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు.
  3. సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో రాహువు సొంత నక్షత్రంలో సంచారం వల్ల అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండడం శ్రేయస్కరం. వృథా ఖర్చులు, అనుకోని ఖర్చులతో పాటు, విలాసాల మీద కూడా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆస్తి వివాదాల్లో కొద్దిగా మోసపోయే సూచనలున్నాయి. దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు. డబ్బుకు సంబంధించి ఇతరుల వాగ్దానాలను నమ్మడం వల్ల ఇబ్బంది పడతారు.
  4. వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాహువు సంచారం వల్ల కుటుంబ సభ్యుల ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారే అవకాశం ఉంది. ఇంటి మరమ్మతుల ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణంలో అంచనాలు తలకిందులవుతాయి.. ఆస్తి వివాదాలు, ఆర్థిక వ్యవహారాలు సమస్యాత్మకంగా మారవచ్చు. అనవసర ప్రయాణాలతో ఆర్థికంగా నష్టపోతారు. అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. బంధుమిత్రుల ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో రాహువు సంచారం వల్ల అనుకోని ఖర్చులకు అవకాశం ఎక్కువగా ఉంది. వీటికి తోడు ఉచిత సహాయాలు, దానధర్మాలు వృద్ధి చెందుతాయి. కుటుంబం అవసరాలతో పాటు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. మొండి బాకీలు పెరుగుతాయి. ఆర్థికంగా కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. డబ్బు ఇవ్వడం, డబ్బు తీసుకోవడం పెట్టుకోవద్దు. డబ్బు తీసుకున్నవారు ముఖం చాటేస్తారు. ఆచితూచి వ్యవహరించడం మంచిది.
  7. మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల ఆదాయం కంటే ఖర్చులు బాగా పెరుగుతాయి. దూర ప్రయాణాల వల్ల డబ్బు నష్టం కలుగుతుంది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థిక వ్యవహారాల్లో బాగా నష్టపోయే సూచనలున్నాయి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆహార, విహా రాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆస్తి వివాదాలు కొద్దిగా ముదురుతాయి. మోసపోయే అవకాశాలున్నాయి. ఆర్థిక సహాయ సహకారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం.
Loading...
Unable to load recommendations.
Follow Us