Zodiac Signs: చంద్ర, శుక్ర గ్రహాల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి అనూహ్య శుభ ఫలితాలు..!

| Edited By: Janardhan Veluru

Jul 13, 2024 | 8:45 PM

మూడు రోజుల పాటు గ్రహ సంచారంలో చంద్ర, శుక్ర గ్రహాల మధ్య రాశి పరివర్తన జరగబోతోంది. ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో శుక్రుడు, శుక్రుడికి చెందిన తులా రాశిలో చంద్రుడు సంచారం చేయడం జరుగుతుంది. ఈ పరివర్తన వల్ల ధన వ్యవ హారాల్లో అనుకూలతలు, శుభ పరిణామాలు..

Zodiac Signs: చంద్ర, శుక్ర గ్రహాల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి అనూహ్య శుభ ఫలితాలు..!
Zodiac Signs
Follow us on

మూడు రోజుల పాటు గ్రహ సంచారంలో చంద్ర, శుక్ర గ్రహాల మధ్య రాశి పరివర్తన జరగబోతోంది. ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో శుక్రుడు, శుక్రుడికి చెందిన తులా రాశిలో చంద్రుడు సంచారం చేయడం జరుగుతుంది. ఈ పరివర్తన వల్ల ధన వ్యవ హారాల్లో అనుకూలతలు, శుభ పరిణామాలు, సుఖ సంతోషాలు వంటివి చోటు చేసుకుంటాయి. ఈ మూడు రోజుల కాలంలో తీసుకునే నిర్ణయాలు తప్పకుండా విజయాలు సాధిస్తాయి. తల్లి వైపు నుంచి, భార్య వైపు నుంచి అనుకూలతలు పెరుగుతాయి. తప్పకుండా స్త్రీమూలక ధన లాభం ఉంటుంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశివారికి చతుర్థ, సప్తమ స్థానాల మధ్య పరివర్తన ఏర్పడుతున్నందువల్ల తల్లి వైపు నుంచి లేదా భార్య వైపు నుంచి బాగా ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి కూడా అదృష్టాలు పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్లు వేయడం జరుగుతుంది. సామాజికంగా గౌరవమర్యాదలు, పలుకుబడి వృద్ధి చెందుతాయి. విశేషంగా ఆదాయ వృద్ధి ఉంటుంది.
  2. మిథునం: ఈ రాశికి ద్వితీయ, పంచమాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. లాటరీలు, వడ్డీ వ్యాపారాలు, షేర్లు, జూదాల వంటివి బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రతిభా పాటవాలు బాగా ప్రకాశిస్తాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. విలాసవంతమైన జీవితం అనుభవిస్తారు.
  3. కర్కాటకం: ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడు చతుర్థ స్థానాధిపతి అయిన శుక్రుడితో పరివర్తన చెందడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ చేస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మాతృమూలక ధన లాభం ఉంటుంది. మాతృ సౌఖ్యం లభిస్తుంది. విదేశీ ప్రయాణాలకు, విహార యాత్రలకు అవకాశం ఉంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఊహించని పరిచయాలు ఏర్పడతాయి.
  4. కన్య: ఈ రాశివారికి ధన, లాభాధిపతుల పరివర్తన జరిగినందువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందు తుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగులు కూడా వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపా రాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి.
  5. తుల: ఈ రాశికి దశమ స్థానంతో పరివర్తన జరిగినందువల్ల ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలన్నిటి లోనూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగు తాయి. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. ఇతర సంస్థల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం మారడానికి ఇది బాగా అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి.
  6. మకరం: ఈ రాశివారికి సప్తమ, దశమ స్థానాల మధ్య పరివర్తన కారణంగా ప్రభుత్వమూలక ధన లాభం, గుర్తింపు లభిస్తాయి. ఉన్నత స్థాయివారితో పరిచయాలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటుండదు. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం లభిస్తుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఉద్యోగం లభిస్తుంది.