Lucky Zodiac Signs in 2023: కొత్త సంవత్సరం(2023)లో ప్రధానంగా నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం అని చెప్పే అదృష్ట యోగం పట్టబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఆకస్మిక ధన లాభం ఏ విధంగా అయినా ఒకరిని వరించవచ్చు. లాటరీ టికెట్ ద్వారా డబ్బు రావడం, ఆస్తుల విలువ అనూహ్యంగా పెరగటం, వారసత్వంగా ఆస్తులు సంక్రమించడం, ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం, ప్రభుత్వం నుంచి బకాయిలు రావడం, అక్రమ సంపాదన వంటివి ఏవైనా కావచ్చు. అదృష్ట యోగం పట్టబోతున్న ఈ నాలుగు రాశులలో కూడా ఒక్కో రాశికి ఒక్కో విధంగా ఆదాయం కలిసి వస్తుంది. కొత్త సంవత్సరంలో ప్రధానంగా జనవరి 18న శనిగ్రహం కుంభరాశిలోకి, గురుగ్రహం ఏప్రిల్ 23న మేషరాశిలోకి, రాహు కేతువులు అక్టోబర్ 24న మీన, తులారాశిలోకి మారుతున్నారు. ఏప్రిల్ 23 తర్వాత మేషరాశిలో గురు రాహువులు కలవడం మేష, మిధున, తుల, ధను రాశుల వారికి ఎంతగానో అదృష్టయోగం పట్టించబోతున్నాయి.
మేషం
ఈ రాశి వారికి జనవరి 18న శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత భారీగా జీతం లేదా ఆదాయం పెరిగే అవకాశముంది. భారీ జీతంతో పాటు కొత్త ఉద్యోగానికి ఆఫర్ రావడం కానీ జరుగుతుంది. ఇప్పటికే ఉన్న ఆస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఏవైనా ఉంటే వాటి వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇక రాదని వదిలేసుకున్న డబ్బు కూడా అనుకోకుండా చేతికి అందుతుంది. మొత్తానికి రెండు మూడు మార్గాల ద్వారా ధన లాభం కలిగే అవకాశం ఉంది.
మిథునం
జనవరి 18 నుంచి అష్టమ శని నుంచి విముక్తి పొందటం, శని భాగ్య స్థానంలోకి మారటం, గురు రాహులు లాభ స్థానానికి రావడం వంటివి ఈ రాశి వారి జీవితాన్ని ఆర్థికంగా చక్కని మలుపు తిప్పబోతున్నాయి. వీటన్నిటినీ కలిపి మహా భాగ్య యోగంగా అభివర్ణించవచ్చు. జీవితంలో ఎన్నడూ ఊహించని అదృష్టం పడుతుందని ఖాయంగా చెప్పవచ్చు. అక్రమ సంపాదనతో సహా అనేక మార్గాల ద్వారా సంపద పెరగటం జరుగుతుంది.
తులా రాశి
చాలాకాలంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల లేకుండా జీవితం గడుపుతున్న ఈ రాశి వారిని కొత్త సంవత్సరం ఆర్థికంగా అందలం ఎక్కించబోతోంది. వివాహం ద్వారా, భార్య తరపు బంధువుల ద్వారా ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. లాటరీ ద్వారా ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. జూదాలు, షేర్లు, లంచాల వంటివి ఊహించని ఆదాయం తీసుకువచ్చే సూచనలు ఉన్నాయి.
ధనుస్సు
ధనయోగం, ఆకస్మిక ధనలాభం వంటి అంశాల్లో ఈ రాశి వారికి కొత్త సంవత్సరం అన్ని విధాలుగాను చాలా బాగుంది. ఊహించని విధంగా చిత్రవిచిత్ర మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. లాటరీ తగిలే అవకాశం ఉంది. ఏలినాటి శని నుంచి విముక్తి లభించడం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ఎక్కడా కష్టపడకుండా, చెమటోడ్చకుండా సునాయాసంగా ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి.
ఇలాంటి మరిన్ని కథనాలు చదవండి..