తెలుగువారి కొత్స సంవత్సరాదినే ఉగాది అని అంటారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బుధవారం (మార్చి 22) నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది. అదేవిధంగా, అక్టోబర్ 24న మీనరాశిలో రాహు సంచారం కన్యారాశిలో కేతువు సంచారం ప్రారంభం అవుతుంది. శని గ్రహం ఈ ఏడాదంతా కుంభ రాశిలో కొనసాగుతుంది. మిగిలిన గ్రహాలు సుమారుగా నెలరోజులు చొప్పున వివిధ రాశుల్లో సంచరించడం జరుగుతుంది. గ్రహాల సంచారం ఆధారంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర కాలంలో మేష రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.
ఈ రాశి వారికి ఈ ఏడాదంతా శని 11వ స్థానంలోనూ, గురువు మొదటి రాశిలోనూ, రాహువు వ్యయంలోనూ, కేతువు 6లోనూ సంచరించడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. సానుకూల మార్పులు, చేర్పులు జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంలో చాలావరకు మెరుగుదల కనిపిస్తుంది. రుణ బాధ పూర్తిగా తగ్గిపోతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి.
గత కొద్ది కాలంగా ఉద్యోగ పరంగా మీరు అనుభవిస్తున్న ఒత్తిడి తగ్గిపోయే అవకాశం ఉంది. ఆదాయం పెంచుకోవడానికి గతంలో మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తాయి. విదేశాలలో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు సానుకూల పడతాయి. వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి. కొందరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి తరపు బంధువులను ఆదుకుంటారు. కొందరు సన్నిహితులు లేదా స్నేహితులు డబ్బు విషయంలో ఇరకాట పెట్టే సూచనలు ఉన్నాయి.
మారనున్న జీవితం..
జూలై, నవంబర్ నెలల మధ్య సంస్కారవంతమైన కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశాలలో ఉద్యోగం సంపాదించడానికి, అక్కడ స్థిరపడటానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. ఐటీ వంటి వృత్తి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులు ఆశించిన స్థాయిలో సత్ఫలితాలను పొందుతారు. శుభవార్తలు వింటారు.
కుల దైవానికి పూజలు..
ఈ రాశి వారికి ముఖ్యంగా మే నెల నుంచి నవంబర్ వరకు విపరీత రాజయోగం పట్టడానికి అవకాశం ఉంది. నవంబర్ తర్వాత కూడా ఆశించిన స్థాయిలో సంపాదన పెరగవచ్చు. అశ్విని భరణి నక్షత్రాల వారు అధికంగా అదృష్టాన్ని లేదా ఆకస్మిక ధన లాభాన్ని అనుభవించే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఎక్కువగా ఇష్ట దైవాన్ని లేదా కుల దైవాన్ని పూజించడం వల్ల మరింతగా సత్ఫలితాలు పొందటానికి అవకాశం ఉంటుంది.
-కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య పండితులు
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..