Telugu News Astrology Mercury Transit in Pisces: Parivartana Yoga Brings Luck for Some, Challenges for These Zodiac Signs
Khala Yoga: ఖల యోగంతో జాగ్రత్త..! వారికి కష్టనష్టాలు, ఆర్థిక ఇబ్బందులు..
Khala Yoga Effects: ఏప్రిల్ 11 నుంచి 30 వరకు బుధుడు మీన రాశిలో సంచారం చేయడం, మిథున రాశిలో గురువుతో పరివర్తన యోగం ఏర్పడడం వల్ల కొంతమంది రాశుల వారికి అనూహ్యమైన అదృష్టాలు కలిగే అవకాశముంది. అయితే దుస్థితి స్థానాల మధ్య ఏర్పడే ‘ఖల యోగం’ కారణంగా మేషం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకరం రాశుల వారు కొంతమేర కష్టనష్టాలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ నెల (ఏప్రిల్) 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బుధుడు మీన రాశిలో సంచారం చేయడం జరుగు తోంది. బుదుడు ఈ రాశిలో సంచారం చేస్తున్నంత కాలం మిథున రాశిలో గురువుతో పరివర్తన జరుగుతుంది. ఈ పరివర్తన యోగం వల్ల కొన్ని రాశులవారికి ఊహించని అదృష్టాలు కలిగే అవ కాశం ఉన్నప్పటికీ, మరికొన్ని రాశులకు దుస్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల ‘ఖల’ యోగ మనే అవయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మేషం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకరం వారికి కొద్దిపాటి కష్టనష్టాలు తప్పకపోవచ్చు.
ఖల యోగం ప్రభావం ఏ రాశివారిపై ఎలా ఉంటుంటో ఇప్పుడు చూద్దాం..
మేషం: ఈ రాశికి తృతీయ, వ్యయ స్థానాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆదాయం కంటే వృథా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కష్టపడి సంపాదించిన, కూడబెట్టిన ధనం నీళ్లలా ఖర్చు కావడం గానీ, వృథా అవడం గానీ జరుగుతుంది. బాగా సన్నిహితులు మోసం చేసే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లు జరగడం, తప్పటడుగులు వేయడం వంటివి జరుగుతాయి. ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా ప్రతిఫలం ఉండదు. ఆదాయ వృద్ధి బాగా మందగిస్తుంది.
కర్కాటకం: ఈ రాశికి వ్యయాధిపతి బుధుడితో భాగ్యాధిపతి గురువుకు పరివర్తన జరగడం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. తండ్రి ఆరోగ్యం దెబ్బతినడం గానీ, తండ్రి వల్ల నష్టపో వడం గానీ జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఇబ్బందులు పడతారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉండదు. ఉద్యోగంలో పదోన్నతులకు పోటీ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ తగ్గుతుంది. ఆదాయ వృద్ధికి అడ్డంకులు కలుగుతాయి.
సింహం: ఈ రాశికి అష్టమ, లాభ స్థానాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులు, అనవసర పరిచయాలు పెరుగుతాయి. నష్టదాయక వ్యవహారాల వల్ల ఆర్థికంగా దెబ్బతినడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలుంటాయి.
తుల: ఈ రాశికి షష్ట, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన వల్ల ఖల యోగం కలిగింది. దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడతారు. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. ఇతరులకు వాగ్దానాలు చేసినా, హామీలు ఉన్నా ఇబ్బందుల పాలయ్యే సూచనలున్నాయి. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. తల్లితండ్రుల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది.
వృశ్చికం: ఈ రాశికి పంచమ, అష్టమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఖల యోగమనే అవయోగం కలిగింది. ఈ రాశివారు ప్రస్తుతానికి ఎక్కడా ఎటువంటి పెట్టుబడులూ పెట్టకపోవడం మంచిది. మీ ప్రయత్నాలు, ప్లాన్లు ఫలించకపోవచ్చు. పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితం అనుకూలంగా సాగకపోవచ్చు. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభించకపోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మకరం: ఈ రాశికి తృతీయ, షష్ట స్థానాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఒకటి రెండు అవయోగాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సహాయం పొంది నవారు ముఖం చాటేస్తారు. ఉచిత సహాయాలు, దానధర్మాల వల్ల ఇబ్బంది పడతారు. ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోవడం జరుగుతుంది. తోబుట్టువులతో అకారణ విభేదాలు తలెత్తుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదం, కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.