Astrology: బుధ, రాహువుల యుతి.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!

Mercury and Rahu Conjunction 2025: జ్యోతిష్య శాస్త్రం మేరకు బుధ రాహువులు ఎక్కడ కలిసినా.. విజయాలు సాధించాలన్న తాపత్రయం బాగా పెరుగుతుంది. ఏదో ఒకటి సాధించి గుర్తింపు పొందాలన్న తపన పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడాలన్న పట్టుదల ఏర్పడుతుంది. దీని కారణంగా నైపుణ్యాలను పెంచుకోవడం, ప్రతిభకు పదను పెట్టడం వంటివి జరుగుతాయి.

Astrology: బుధ, రాహువుల యుతి.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
Telugu Astrology
Image Credit source: Getty

Edited By:

Updated on: Feb 27, 2025 | 4:22 PM

Telugu Astrology: బుధ రాహువులు ఎక్కడ కలిసినా విజయాలు సాధించాలన్న తాపత్రయం బాగా పెరుగుతుంది. ఏదో ఒకటి సాధించి గుర్తింపు పొందాలన్న తపన పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి బయటపడాలన్న పట్టుదల ఏర్పడుతుంది. దీని కారణంగా నైపుణ్యాలను పెంచుకోవడం, ప్రతిభకు పదను పెట్టడం వంటివి జరుగుతాయి. కొన్ని రాశుల మీద ఈ రెండు గ్రహాల ప్రభావం అంతగా కనిపించనప్పటికీ వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, మకర, కుంభ రాశుల వారు మాత్రం అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోయే ఈ బుధ రాహువుల యుతి మే 6వ తేదీ వరకు కొనసాగుతుంది.

  1. వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో బుధ రాహువులు కలవడం వల్ల ఈ రాశివారు తప్పకుండా కొత్త నైపుణ్యాల మీద శ్రద్ద పెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో మరింతగా ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాల్లో కొత్త మార్పులు, పద్ధతులు చేపట్టి లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ రాశివారిలో మరింతగా సంపాదించాలన్న తాపత్రయం కూడా బాగా పెరుగుతుంది. గట్టి పట్టుదలతో అనేక ఆదాయ వృద్ధి ప్రయత్నాలను చేపట్టి తమ లక్ష్యాలను సాధించుకుంటారు.
  2. మిథునం: రాశ్యధిపతి బుధుడితో దశమంలో రాహువు కలుస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో మరింతగా ఎదగడం మీదా, వీలైతే సొంతగా సంస్థను స్థాపించడం మీదా ఈ రాశివారి దృష్టి మళ్లుతుంది. అందుకు సంబంధించిన నైపుణ్యాలను, వనరులను సమకూర్చుకునే అవకాశం ఉంది. నిరుద్యో గులు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు అందుకుంటారు. వ్యాపారాల్లో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టడం ద్వారా అంచనాలకు మించిన లాభాలు గడిస్తారు. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి.
  3. కన్య: ఈ రాశివారికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో రాహువు కలిసినందువల్ల విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలన్న కోరిక కొద్ది ప్రయత్నంతో నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా కూడా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు, ఆశలు తప్పకుండా ఫలిస్తాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాలను లాభాల బాట పట్టిస్తారు.
  4. ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో బుధ రాహువుల యుతి జరగడం వల్ల ఉద్యోగంలో సరికొత్త నైపు ణ్యాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంది. తమ ప్రతిభా పాటవాలకు మరింతగా పదను పెట్టుకోవడం జరుగుతుంది. ఆస్తి వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పు లను చేపట్టడం ద్వారా పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు.
  5. మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో బుధ రాహువుల యుతి వల్ల వీరిలో ఆత్మవిశ్వాసం, పట్టుదల బాగా వృద్ధి చెందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడానికి గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి ఆదాయాన్ని బాగా పెంచుకుంటారు. ఆదాయ మార్గాలు బాగా విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారు. సరికొత్త పద్ధతులను అనుసరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కూడా మార్పులు, చేర్పులు చేపట్టి లబ్ధి పొందుతారు.
  6. కుంభం: ఈ రాశికి ధన స్థానంలో బుధ రాహువుల కలయిక వల్ల వీరిలో ధన వృద్ధికి సంబంధించిన ఆకాంక్షలు బాగా వృద్ధి చెందుతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక మార్గాలను అనుసరించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభ, సమర్థతలకు సంబంధించి సహోద్యోగుల మీద పైచేయి సాధిస్తారు. వ్యాపారాల్లో కొత్త పద్దతులు, కొత్త మార్పులు చేపట్టి లాభాల్లో పురోగతి చెందుతారు. విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యం నెరవేరుతుంది. మనసులోని కోరికలు కొన్ని తీరిపోతాయి.