Bhadra Yoga: ఆ నాలుగు రాశుల వారికి మహా పురుష యోగం.. జీవితంలో సానుకూలమైన ఆకస్మిక మార్పులు తథ్యం.. !

| Edited By: Janardhan Veluru

Jun 30, 2023 | 3:45 PM

ప్రస్తుతం మిధున రాశిలో సంచరిస్తున్న బుధ గ్రహం కారణంగా నాలుగు రాశుల వారికి అతి ముఖ్యమైన శుభ ఫలితాలు, శుభ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. బుధ గ్రహం కేంద్రాలలో అంటే 1,4,7,10 స్థానాలలో తన స్వక్షేత్రం లేదా ఉచ్ఛ స్థానంలో సంచరిస్తున్నప్పుడు భద్ర యోగం అనే ఒక మహా పురుష యోగం ఏర్పడుతుంది.

Bhadra Yoga: ఆ నాలుగు రాశుల వారికి మహా పురుష యోగం.. జీవితంలో సానుకూలమైన ఆకస్మిక మార్పులు తథ్యం.. !
Maha Purusha Yoga
Follow us on

Maha Purusha Yoga: ప్రస్తుతం మిధున రాశిలో సంచరిస్తున్న బుధ గ్రహం కారణంగా నాలుగు రాశుల వారికి అతి ముఖ్యమైన శుభ ఫలితాలు, శుభ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. బుధ గ్రహం కేంద్రాలలో అంటే 1,4,7,10 స్థానాలలో తన స్వక్షేత్రం లేదా ఉచ్ఛ స్థానంలో సంచరిస్తున్నప్పుడు భద్ర యోగం అనే ఒక మహా పురుష యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం మిధునం, కన్య, ధనస్సు, మీన రాశుల వారికి ఈ యోగం ఏర్పడింది. ఇది జూలై నెల 8వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ యోగం వల్ల తప్పకుండా కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు, శుభయోగాలు అనుభవానికి వస్తాయి.

  1. మిథునం: ఈ రాశిలో ప్రస్తుతం భద్ర మహా పురుష యోగం కొనసాగుతోంది. దీనివల్ల మనసులోని కోరికలు నెరవేరటం, వ్యక్తిగత సమస్యలు ఏవైనా ఉంటే అప్రయత్నంగా పరిష్కారం కావడం, ఉద్యోగంలో ప్రముఖ స్థానానికి చేరుకోవడం, సామాజికంగా హోదా పెరగటం, ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కోల్పోవడం, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఏ విషయంలో ఎటువంటి ప్రయత్నం తలపెట్టినప్పటికీ అది తప్పకుండా పూర్తవుతుంది. మంచి నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి ఇది చాలా అనుకూల సమయం.
  2. కన్య: ఈ రాశి వారికి దశమ స్థానంలో అంటే ఉద్యోగ స్థానంలో భద్ర మహాపురుష యోగం చోటు చేసుకోవడం వల్ల, కెరీర్ పరంగా అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగంతో పాటు వృత్తి వ్యాపారాలు సైతం కొత్త పుంతలు తొక్కడం జరుగుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. ఉద్యోగంలో ఊహించని స్థాయిలో పురోగతి ఉంటుంది. మంచి ఉద్యోగం లోకి మారటానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో గుర్తింపు డిమాండ్ పెరగడంతో పాటు విస్తరించే అవకాశం కూడా ఉంది. వ్యాపారం ఊపందుకుంటుంది. పలుకుబడి బాగా పెరుగుతుంది.
  3. ధనుస్సు: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో ఈ మహా పురుష యోగం ఏర్పడినందువల్ల అవివాహితు లకు ఎంతో మంచి సంబంధం నిశ్చయం కావడం, పెళ్లయిన వారికి అన్యోన్యత పెరగటం, విహార యాత్రలు చేయడం, సంతానానికి సంబంధించి శుభవార్త వినటం, జీవిత భాగస్వామి విజయాలు సాధించటం, దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వినటం వంటివి జరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి తప్పకుండా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు విజయవం తంగా పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.
  4. మీనం: మీన రాశి వారికి నాలుగవ స్థానంలో అంటే సుఖ స్థానంలో ఈ యోగం ఏర్పడటం వల్ల, సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంటుంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. కొత్తగా ఆస్తులు కొనడానికి అవకాశం ఉంటుంది. ఆస్తి సంబంధ మైన వివాదాలు పరిష్కారం అవుతాయి. తల్లి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సామాజిక హోదా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలకు అవకాశం ఉంది. ఏవైనా మొక్కులు ఉంటే తీరిపోతాయి.
  5. ఇవి కూడా చదవండి

Note: ఇక్కడ ఇచ్చిన సమాచారం వ్యక్తుల నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..