Love Astrology: అనుకూలంగా మూడు గ్రహాలు.. ఈ రాశుల వారికి ప్రేమ వివాహం ఖాయం!

శుక్రుడు, బుధుడు, గురువుల అనుకూల స్థానం వల్ల కొన్ని రాశుల వారికి ప్రేమ వివాహాలకు అధిక అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతంగా ముగిసి వివాహ బంధంలోకి దారి తీస్తాయి. సంపన్న కుటుంబాలతో వివాహం జరిగే అవకాశం కూడా ఉంది. అక్టోబర్ వరకు ఈ అనుకూలత కొనసాగుతుంది.

Love Astrology: అనుకూలంగా మూడు గ్రహాలు.. ఈ రాశుల వారికి ప్రేమ వివాహం ఖాయం!
Love Astrology 2025

Edited By: Janardhan Veluru

Updated on: Jul 30, 2025 | 12:08 PM

ప్రస్తుతం శుక్ర, బుధ, శుక్రుల అనుకూలత వల్ల కొన్ని రాశుల వారికి తప్పకుండా ప్రేమ వివాహమే అయ్యే అవకాశం ఉంది. ఎంత ప్రయత్నించినా వీరికి పెళ్లి సంబంధాలు కుదరకపోవచ్చు. ఈ మూడు శుభ గ్రహాలు మిథున, కర్కాటక రాశుల్లో సంచారం చేయడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో కొన్ని రాశుల వారు ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశివారు ప్రేమలో పడడం గానీ, ఇప్పటికే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెళ్లికి మార్గం సుగమం అవడం గానీ జరుగుతుంది. అక్టోబర్ వరకూ ఈ శుభ గ్రహాల అనుకూలత కొన సాగుతున్నందువల్ల వీరి ప్రేమలు విజయవంతం అయి, పెళ్లి పీటల మీద కూర్చోవడం జరుగుతుంది.

  1. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ప్రస్తుతం గురువుతో కలిసి కుటుంబ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు అతి త్వరలో ప్రేమ జీవితంలో విజయం సాధించే అవకాశం ఉంది. కొత్తగా ప్రేమ జీవితంలో ప్రవేశించడానికి కూడా అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి ప్రవేశించడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం తప్పకుండా జరుగుతుంది. సాధారణంగా పెద్దల అనుమతితో పెళ్లి జరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశిలో గురు, శుక్రులు, కుటుంబ స్థానంలో రాశ్యధిపతి బుధుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా ప్రేమ వివాహమే అయ్యే అవకాశం ఉంది. ఈ రాశివారి ప్రేమ జీవితం కూడా నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. ప్రేమలో పడేవారికి, ప్రేమలో పడినవారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వీరి ప్రేమ జీవితం సమీప భవిష్యత్తులో వివాహ మహోత్సవానికి దారితీసే అవకాశం ఉంది. సాధారణంగా సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగుతుంది.
  3. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో గురు, శుక్రులు, లాభ స్థానంలో రాశ్యధిపతి బుధుడి సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో గానీ, సహోద్యోగితో కానీ, విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో గానీ ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది. వీరి ప్రేమ జీవితమే కాక, వైవాహిక జీవితం కూడా నిత్య కల్యాణం పచ్చ తోరణంగా సాగిపోతుంది. ప్రేమ ప్రయత్నాలు సాగిస్తున్నవారు తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. పెద్దల అనుమతితో వివాహం జరగడానికి అవకాశం ఉంది.
  4. తుల: సహజంగా ప్రేమించే తత్వం ఎక్కువగా ఉండే ఈ రాశివారు సాధారణంగా ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత గ్రహ పరిస్థితులను బట్టి విదేశాల్లో స్థిరపడిన బంధువుతో కానీ, ఐటి రంగానికి చెందిన వ్యక్తితో గానీ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ప్రేమ జీవితం, పెళ్లి జీవితం వీరికి నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ప్రేమ ప్రయత్నాలు సాగిస్తున్నవారు తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. పెద్దల అనుమతితో వీరి పెళ్లి జరుగుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశికి సప్తమంలో గురు, శుక్రులు, అష్టమ స్థానంలో బుధుడి సంచారం వల్ల వీరు ప్రేమ వివాహం వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. వీరి ప్రేమ జీవితం తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, వైభవంగా, ఆడంబరంగా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కొత్తగా ప్రేమ ప్రయత్నాలు సాగిస్తున్నవారు శుక్రుడి ప్రభావం కారణంగా విజయం సాధించే అవకాశం ఉంది. అక్టోబర్ లోపు పెళ్లి జరిగే సూచనలున్నాయి.
  6. కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురు, శుక్రుల సంచారం వల్ల తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో గురువు ఉచ్ఛపడుతున్నందు వల్ల ఆ సమయంలో వీరి ప్రేమ జీవితం పెళ్లి జీవితంగా మారే అవకాశం ఉంది. నిబద్ధత, చిత్తశుద్ధి కలిగిన ఈ రాశివారు ప్రేమ జీవితంలోనైనా, పెళ్లి జీవితంలో అయినా అంకితభావంతో వ్యవహరించడం జరుగుతుంది. పరిచయస్థులతో గానీ, సహోద్యోగితో గానీ ప్రేమలో పడే అవకాశం ఉంది. పెద్దల అనుమతితోనే పెళ్లి జరుగుతుంది.