Raja Yoga: మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. ఆ రాశుల వారికి రాజయోగ ఫలితాలు..!

| Edited By: Janardhan Veluru

Apr 24, 2024 | 5:53 PM

ఈ నెల 25 నుంచి మేష రాశిలో ఉచ్ఛ రవి, శుక్ర, గురు గ్రహాలు కలిసి సంచారం చేస్తాయి. ఈ మూడు శుభ గ్రహాల మీదా కుంభ రాశి నుంచి శనీశ్వరుడి ‘తృతీయ’ దృష్టి పడుతోంది. సాధారణంగా ఏ గ్రహం మీదయినా శని దృష్టి పడితే చెడు ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అయితే, శని తన స్వస్థానమైన కుంభరాశి నుంచి ఈ మూడు గ్రహాలను వీక్షిస్తున్నందువల్ల చెడు కంటే మంచే ఎక్కువగా జరుగుతుంది.

Raja Yoga: మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. ఆ రాశుల వారికి రాజయోగ ఫలితాలు..!
Lord Shani Dev
Follow us on

ఈ నెల 25 నుంచి మేష రాశిలో ఉచ్ఛ రవి, శుక్ర, గురు గ్రహాలు కలిసి సంచారం చేస్తాయి. ఈ మూడు శుభ గ్రహాల మీదా కుంభ రాశి నుంచి శనీశ్వరుడి ‘తృతీయ’ దృష్టి పడుతోంది. సాధారణంగా ఏ గ్రహం మీదయినా శని దృష్టి పడితే చెడు ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అయితే, శని తన స్వస్థానమైన కుంభరాశి నుంచి ఈ మూడు గ్రహాలను వీక్షిస్తున్నందువల్ల చెడు కంటే మంచే ఎక్కువగా జరుగుతుంది. ఈ శని దృష్టి వల్ల మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి రాజయోగ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి.

  1. మేషం: ఈ రాశిలో సంచారం చేస్తున్న గురు, శుక్ర, రవుల మీద శని దృష్టి పడడం వల్ల జీవితంలో చురుకుదనం, వేగం పెరిగే అవకాశముంటుంది. ఏ పనినీ వాయిదా వేయకపోవడం, సత్వరం పూర్తి చేయాలనుకోవడం జరుగుతుంది. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నా లన్నీ ఊపందుకుంటాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు, రాబడి అంచనాలను మించి పోతాయి. నిరుద్యోగులు ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  2. మిథునం: ఈ రాశివారికి లాభ స్థానంలో ఉన్న గురు, శుక్ర, రవి గ్రహాలను భాగ్య స్థానం నుంచి శనీశ్వరుడు వీక్షించడం వల్ల విదేశీ సొమ్ము అనుభవించే యోగం కలుగుతుంది. విదేశీ సంబంధమైన ప్రతి ప్రయత్నమూ కలిసి వస్తుంది. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా వేగంగా పూర్తవుతుంది. అనేక విధాలుగా, అనేక మార్గాల్లో భాగ్యం పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గు ముఖం పడతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు.
  3. సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న రాశ్యధిపతి రవితో సహా మూడు శుభ గ్రహాల మీద శని దృష్టి పడడం వల్ల రాజకీయంగా ప్రాముఖ్యం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యత ఏర్పడుతుంది. నిరుద్యోగు లకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వస్తాయి. తండ్రి నుంచి ఆస్తి కలిసి వస్తుంది.
  4. తుల: ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు పంచమ స్థానం నుంచి సప్తమ స్థానంలో ఉన్న గురు, శుక్ర, రవులను వీక్షించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులకు, హోదా పెరగడానికి అవకాశముం టుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, దాంతో పాటే రాబడి పెరిగే సూచనలున్నాయి. సామాజికంగా కూడా స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా మారు తుంది. సంపన్నులకు చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ధన యోగాలు కలుగుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు, ఉచ్ఛ రవి, రాశ్యధిపతి గురువుపై తృతీయ స్థానం నుంచి శని దృష్టి పడినందువల్ల ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలతో పాటు ఆర్థికంగా కూడా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అన్ని విధాలుగానూ ప్రాభవం, ప్రాధాన్యం పెరు గుతాయి. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
  6. మకరం: ఈ రాశికి ధన స్థానంలో స్వక్షేత్రంలో ఉన్న శనీశ్వరుడు చతుర్థ స్థానంలో గురు, రవి, శుక్రులను వీక్షించడం వల్ల గృహ, వాహన సౌకర్యాలు బాగా మెరుగుపడతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, సామాజికంగా కూడా హోదా పెరుగు తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.