తులా రాశి వార్షిక ఫలితాలు 2026: ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది..!

Thula Rashi 2026 Horoscope: తుల రాశి వారికి ఈ సంవత్సరం గురు, రాహు, శని గ్రహ సంచారాల వల్ల అత్యంత సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుత ప్రగతి, ఆర్థిక లాభాలుంటాయి. ప్రేమ వివాహాలు, సంతాన ప్రాప్తికి అవకాశాలున్నాయి. ఆరోగ్యంతో పాటు అనుకున్న పనులు నెరవేరి, సుఖ సంతోషాలతో గడుస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం.

తులా రాశి వార్షిక ఫలితాలు 2026: ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది..!
Thula Rashi 2026 Horoscope

Edited By:

Updated on: Dec 28, 2025 | 8:28 PM

Libra Horoscope 2026: షష్ట స్థానంలో శనీశ్వరుడు, పంచమ స్థానంలో రాహువు, జూన్ నుంచి దశమంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల తుల రాశివారికి ఈ ఏడాదంతా చాలావరకు సానుకూలంగానే గడిచిపోతుందని చెప్ప వచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సాధారణంగా ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి లేదా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు కూడా బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలకు, విదేశీ పర్యటనలకు బాగా అవకాశం ఉంది.

ప్రేమలు, పెళ్లిళ్లు, సంతానం

సహోద్యోగితో లేదా బాగా పరిచయం ఉన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహా రాలు పెళ్లికి దారి తీస్తాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈ రాశివారికి ఫిబ్రవరి, మే నెలల మధ్య పెళ్లయ్యే అవకాశం కూడా ఉంది. జూలై, అక్టోబర్ నెలల మధ్య సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వింటారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది.

అనుకూల పరిస్థితులు

కొత్త సంవత్సరంలో ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడితే తప్ప, శ్రద్ధ పెంచితే తప్ప ఆశించిన ఫలితాలు సిద్ధించకపోవచ్చు. సంవత్సరం మొత్తం మీద ఒకటి రెండు సార్లు ధన యోగం పట్టే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆశించిన పనులు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా సఫలం అవుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు.

అనుకూల నెలలు

ఈ రాశివారికి శని, రాహు, గురువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏడాదంతా అనుకూలంగా సాగిపోతుంది. ఫిబ్రవరి, మే నెలల మధ్య పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. జూలై తర్వాత పెళ్లయ్యే అవకాశం ఉంది. గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఏడాదంతా ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఆరోగ్యం బాగా నిలకడగా సాగిపోతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. పిల్లలు రికార్డు స్థాయిలో విజయాలు సాధిస్తారు. ఏడాదంతా షేర్లు, స్పెక్యులేషన్ల వంటి అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తూ ఉంటాయి.