
సింహ రాశివారికి జూన్ నెల వరకు ఏ విషయంలోనూ తిరుగుండదు. అష్టమ శని ప్రభావం కూడా బాగా తగ్గి ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు సమసిపోతాయి. ద్వితీయార్థంలో మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం మందగిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆర్థికాభివృద్ధి ఉండకపోవచ్చు. ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆదాయం కొద్ది కొద్దిగా మాత్రమే పెరుగుతూ ఉంటుంది. అవసరాలు తీరుతూ ఉంటాయి. ఆరోగ్యానికి లోటుండదు. వ్యయ స్థానంలో ఉన్న గురువు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు కానీ, ప్రతిఫలం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విదేశీ ఉద్యోగాలకు లేదా చదువులకు అవకాశం ఉంటుంది.
సంవత్సర ప్రథమార్థంలో ప్రేమ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో ఫిబ్రవరి ప్రాంతంలో దూర ప్రాంతాల నుంచి శుభ సమాచారం అందుకుంటారు.
సంవత్సరం ప్రథమార్థంలో అనుభవానికి వచ్చినన్ని అనుకూలతలు ద్వితీయార్థంలో కనిపించక పోవచ్చు. ప్రథమార్థంలో ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ద్వితీయార్థంలో మాత్రం వ్యయ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఉద్యోగపరంగా, ఆదాయపరంగా, వృత్తి, వ్యాపారాలపరంగా బాగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉద్యోగం మారాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధ్యం కాకపోవచ్చు. మంచి అవకాశాలను చేజార్చుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.
ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటించడం చాలా అవసరం. అష్టమంలో రాహువు సంచారం వల్ల రాజకీయంగా పలుకుబడి పెరిగే సూచనలున్నాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. తండ్రితో కొద్దిగా విభేదాలు తలెత్తవచ్చు. మాట తొందరపాటు వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆహార, విహారాల్లో తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. విద్యార్థులు మే నెల నుంచి తమ చదువులపై శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు నాలుగైదు ప్రయత్నాల తర్వాతే సఫలం అవుతాయి.
ఈ రాశివారికి మే నెల వరకూ ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆ తర్వాత దాదాపు ప్రతి నెలా ఏదో విధమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా ఇబ్బంది పడతారు. అన్ని విషయాల్లో తగ్గి ఉండడం అవసరం.