Kumbh Zodiac Signs: శని గ్రహాన్ని కుంభ రాశికి అధిపతిగా చెబుతుంటారు. అలాగే కుంభ రాశి వారు ధనిష్ట నక్షత్రం, శతభిష లేదా పూర్వాభాద్రపద నక్షత్రాలతో సంబంధం కలిగి ఉంటారు. ఆచరణాత్మకంగా ఈ రాశిచక్రంలోని వ్యక్తులు చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తుంటారు. ప్రస్తుత రాశిచక్రంలో బుధుడు, శుక్రుడు, శని గ్రహాలు స్నేహితులుగా కనిపిస్తున్నారు. అయితే, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బృహస్పతి మాత్రం శత్రువులుగా మారారు. ఈ రాశిచక్రంలో కుంభ రాశి వారికి ఎందుకు అంత విశిష్టత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
కుంభ రాశి వారు సాధారణంగా సన్నగా ఉంటారు. వారి కళ్ళు గొప్ప గంభీరతను ప్రదర్శిస్తాయి. వారు చాలా రహస్యంగా, ఏకాంతాన్ని ఇష్టపడుతుంటారు. ఈ రాశిచక్రంలోని వ్యక్తులు మర్యాదపూర్వకంగా, మంచి స్వభావం కలిగి ఉంటారు. వారి ఆలోచన శాస్త్రీయంగా, తార్కికంగా ఉంటుంది. వీరు తాత్విక, ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉంటారు. ఒకే సంస్థలో పనిచేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే, వీరికి గొప్పతనానికి క్రెడిట్ తీసుకోవడం ఇష్టం ఉండదు. ఇదే కుంభరాశి వారి ప్రత్యేకతగా నిలుస్తుంది. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం.. జాగ్రత్తగా ఉండాలి.
సాధారణంగా కుంభరాశి వారి ఆరోగ్యంలో కలత చెందాల్సి ఉంటుంది. యవ్వనంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఉన్నాయి. సాధారణంగా జీవిత భాగస్వామి వారిని డామినేట్ చేస్తుంటారు. వారు చాలా త్వరగా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో వివిధ మార్గాల్లో నడుస్తుంటారు.
ఈ రాశి వారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా పూజలు, ధ్యానం చేయాలి. వ్యసనాలను వదిలేయాలి. కుంభ రాశి వారు వివాహంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎక్కువగా తెలుపు రంగును ఉపయోగించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..