Astrology: కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు, శుభ ఫలితాలు

| Edited By: Janardhan Veluru

Dec 26, 2024 | 6:37 PM

కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్న కుజ గ్రహం ఈ నెల(డిసెంబర్) 28 నుంచి జనవరి 21 వరకు కుంభ రాశిలో ఉన్న శని, శుక్రులను వీక్షిస్తుంది. కుజ దృష్టి వల్ల శని, శుక్రులకు కొత్త శక్తి లభించే అవకాశం ఉంటుంది. దీని ప్రభావంతో ఆ రెండు గ్రహాలలో వేగం పెరుగుతుంది. ఫలితంగా ఇవి కొన్ని రాశులకు అత్యంత శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.

Astrology: కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు, శుభ ఫలితాలు
Kuja Graha Astrology
Follow us on

ప్రస్తుతం కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్న కుజ గ్రహం ఈ నెల 28 నుంచి జనవరి 21 వరకు కుంభ రాశిలో ఉన్న శని, శుక్రులను వీక్షించడం జరుగుతోంది. కుజ దృష్టి వల్ల శని, శుక్రులకు కొత్త శక్తి లభించే అవకాశం ఉంటుంది. ఈ రెండు గ్రహాలలో వేగం పెరుగుతుంది. ఫలితంగా ఇవి కొన్ని రాశులకు అత్యంత శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. మేషం, వృషభం, కన్య, తుల, వృశ్చికం, కుంభ రాశుల వారి జీవితాల్లో పెనుమార్పులకు ఇది దోహదం చేస్తుంది. ఆదాయం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు, కొత్త ప్రయత్నాలు, సంతానం వంటి కీలక అంశాల మీద దీని ప్రభావం ఉంటుంది.

  1. మేషం: రాశ్యధిపతి కుజుడి దృష్టి లాభస్థానంలో ఉన్న శని, శుక్రుల మీద పడినందువల్ల ఆదాయ ప్రయ త్నాల్లో, ఆదాయ వృద్ధిలో స్తబ్ధత తొలగిపోతుంది. ఒక్కసారిగా ఆదాయం పెరగడం ప్రారంభం అవు తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆగిపోయిన పదోన్న తులు, జీతాల పెరుగుదల వంటివి ఇక నుంచి చోటు చేసుకుంటాయి. కొన్ని ముఖ్యమైన ప్రయ త్నాలు, వ్యవహారాల్లో క్రియాశీలంగా వ్యవహరించడం జరుగుతుంది. ఆరోగ్యం దృఢమవుతుంది.
  2. వృషభం: ఈ రాశికి తృతీయ స్థానం నుంచి దశమంలో ఉన్న శని, శుక్రులను కుజుడు వీక్షించడం వల్ల ఉద్యోగం మారడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్న మైనా సానుకూలపడడం జరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రతి అవకాశాన్నీ విని యోగించుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేసి లాభాలు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన తప్పకుండా లభిస్తుంది.
  3. కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో ఉన్న శని, శుక్రుల మీద కుజ దృష్టి పడినందువల్ల ఏ ప్రయత్నం తల పెట్టినా విజయం వరిస్తుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపట్టడం మంచిది. ప్రయత్న లోపం ఉండని పక్షంలో ఆదాయం కూడా అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. అనారోగ్యానికి సరైన చికిత్స లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం చేసే అవకాశం ఉంది.
  4. తుల: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న కుజుడు పంచమ స్థానంలో ఉన్న శని, శుక్రులను వీక్షించడం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. తప్పకుండా భూలాభం కలుగుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంది.
  5. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానం నుంచి శని, శుక్రులను వీక్షించడం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపో తుంది. సామాజికంగా స్థాయి, హోదా పెరుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు, అవకాశాలు అందుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలకు ఆటంకాలు తొలగిపోతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది.
  6. కుంభం: ఈ రాశిలో ఉన్న శని, శుక్రుల మీద ఆరవ స్థానం నుంచి కుజుడి దృష్టి పడినందువల్ల, జీవితంలో స్తబ్ధత తొలగిపోయి, వేగం పెరుగుతుంది. ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఆదా యం వృద్ధి చెందడం మీద దృష్టి కేంద్రీకరించి విజయాలు సాధిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. చురుకుగా వ్యవహరించడం ప్రారంభిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో సమర్థతను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.