Money Horoscope: మీన రాశిలో కుజుడు సంచారం.. ఈ రాశల వారికి ధన యోగాలు పక్కా.. !

| Edited By: Vimal Kumar

May 02, 2024 | 12:28 PM

మీన రాశి అధిపతి అయిన గురువు కుజ గ్రహానికి మిత్ర గ్రహం. అందువల్ల కుజుడు ఈ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఉచ్ఛ బలంతో వ్యవహరిస్తాడు. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కుజుడు ఈ రాశిలో స్వతంత్రంగా ఫలితాలనివ్వడం జరుగుతుంది.దేన్నయినా గట్టి పట్టుదలతో సాధించుకునే తత్వం కలిగిన కుజుడు ఈ రాశుల వారికి కొద్ది ప్రయత్నం ఆర్థిక లాభాలను అందజేయడం జరుగుతుంది.

Money Horoscope: మీన రాశిలో కుజుడు సంచారం.. ఈ రాశల వారికి ధన యోగాలు పక్కా.. !
Zodiac Signs In Telugu
Follow us on

మీన రాశి అధిపతి అయిన గురువు కుజ గ్రహానికి మిత్ర గ్రహం. అందువల్ల కుజుడు ఈ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఉచ్ఛ బలంతో వ్యవహరిస్తాడు. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కుజుడు ఈ రాశిలో స్వతంత్రంగా ఫలితాలనివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చిక, కుంభ రాశుల వారికి ఈ కుజుడు ధన యోగాలు పట్టించడం జరుగుతుంది. దేన్నయినా గట్టి పట్టుదలతో సాధించుకునే తత్వం కలిగిన కుజుడు ఈ రాశుల వారికి కొద్ది ప్రయత్నం ఆర్థిక లాభాలను అందజేయడం జరుగుతుంది.

  1. వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడి వల్ల ఈ రాశివారికి సోదర మూలక ధన లాభం కలుగుతుంది. ముఖ్యంగా భూసంబంధమైన వివాదాల్లో సానుకూల పరిష్కారం జరుగు తుంది. భూములు లేదా స్థలాలు కొనే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, డాక్టర్లు, మద్యం వ్యాపా రులు లాభ కుజుడి వల్ల అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కెరీర్ పరంగా కూడా వీరికి అత్యధిక ఆర్థిక లాభాలు చేకూరుతాయి. శస్త్రచికిత్సల ద్వారా ఆరోగ్యం కుదుటపడుతుంది.
  2. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల ఉద్యోగంలో వీరికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. నిరుద్యోగు లకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారే సూచనలున్నాయి. వారసత్వ ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సోదరులతో సఖ్యత పెరుగు తుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు భాగ్య స్థానంలో సంచరించడం వల్ల సమయం అన్ని విధాలుగానూ యోగదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. అనేక విధా లుగా అదృష్టం కలిసి వస్తుంది. విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఆటంకా లన్నీ తొలగిపోతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. భూ సంబంధమైన ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఎక్కువగా తీర్థయాత్రలు లేదా విహార యాత్రలు చేయడం జరుగుతుంది.
  4. తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో ఉన్న కుజుడి వల్ల ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కూడా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆకస్మిక ధన లాభా నికి అవకాశముంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. శత్రు, రోగ, రుణ సమ స్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. లాయర్లు వాదోపవాదాల్లో విజయాలు సాధిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సల్లో కొత్త రికార్డులు సృష్టిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది.
  5. వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచ నలు ప్రవేశపెట్టి లాభాలు గడిస్తారు. వృత్తి జీవితంలో ఉన్నవారికి ఆశించిన ప్రచారం లభిస్తుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతానం లేనివారు సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగు తుంది.
  6. మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజుడు స్వతంత్ర సంచారం సాగిస్తున్నందువల్ల అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, కుటుంబపరంగా కూడా శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు రెట్టింపు అవుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయం సాధిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది.