Kuja Gochar 2024: మకర రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారికి రాజయోగం, ధన యోగం.. అయితే..!

మకర రాశిలో కుజుడి సంచారం వల్ల ఆరు రాశుల వారికి టెన్షన్లతో కూడిన రాజయోగం, ధన యోగం పట్టే అవకాశం ఉంది. మకర రాశి కుజుడికి ఉచ్ఛరాశి. తన ఉచ్ఛ రాశిలో కుజుడు మార్చి 15 వరకు కొనసాగుతాడు. ఈ నెలా పది రోజుల కాలంలో కుజుడు మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, కుంభ రాశులకు రాజ యోగాలు కలిగించే అవకాశం ఉన్నప్పటికీ,

Kuja Gochar 2024: మకర రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారికి రాజయోగం, ధన యోగం.. అయితే..!
Kuja Gochar

Edited By: Janardhan Veluru

Updated on: Feb 08, 2024 | 7:33 PM

మకర రాశిలో కుజుడి సంచారం వల్ల ఆరు రాశుల వారికి టెన్షన్లతో కూడిన రాజయోగం, ధన యోగం పట్టే అవకాశం ఉంది. మకర రాశి కుజుడికి ఉచ్ఛరాశి. తన ఉచ్ఛ రాశిలో కుజుడు మార్చి 15 వరకు కొనసాగుతాడు. ఈ నెలా పది రోజుల కాలంలో కుజుడు మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, కుంభ రాశులకు రాజ యోగాలు కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి, టెన్షన్లు, వ్యయప్రయాసలు ఉండే అవకాశం కూడా ఉంది. ధనార్జనకు కారకుడైన కుజుడు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశులకు తప్పకుండా అధికార యోగం, ఆదాయ యోగం పడతాయి. మార్చి 15 వరకు ఈ రాశుల వారు అనేక రకాల ఒత్తిళ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతారు.

  1. మిథునం: ఈ రాశికి కుజుడు అష్టమంలో ఉచ్ఛపట్టడం వల్ల విపరీత రాజయోగం ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. వారసత్వ సంపద సమకూరుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తి వివాదాలు తేలికగా పరి ష్కారం అవుతాయి. అయితే, పని భారం పెరగడం వల్ల, ప్రయాణాలు ఎక్కువగా ఉండడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు.
  2. కర్కాటకం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచరిస్తున్న కుజుడు ఈ రాశిని పూర్ణ దృష్టితో వీక్షిస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో అధికారం దక్కే అవకాశం ఉంటుంది. దీనివల్ల బరువు బాధ్యతలు పెరిగి విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి కూడా క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఆదాయం పెరగడం, రాబడి వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి కానీ, పని ఒత్తిడి కారణంగా ఉక్కిరిబిక్కిరి అవడం జరుగుతుంది.
  3. కన్య: ఈ రాశికి పంచమ స్థానంలో ఉచ్ఛస్థితిలో సంచరిస్తున్నకుజుడి వల్ల వీరికి ఏ ప్రయత్నం తల పెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. వీరి సలహాలు, సూచనలకు విలువ, ఆదరణ పెరు గుతాయి. సర్వత్రా గౌరవాభిమానాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉచ్ఛదశకు చేరుకుం టారు. అయితే, వ్యక్తిగత విషయాల్లోనూ, కుటుంబ వ్యవహారాల్లోనూ టెన్షన్లకు అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల వల్ల కూడా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతికి దూరమవుతారు.
  4. తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో, అంటే సుఖ స్థానంలో కుజుడి ఉచ్ఛ స్థితి వల్ల వృత్తి, ఉద్యోగాలపరం గానే కాకుండా, సామాజికంగా కూడా హోదా, గౌరవ మర్యాదలు, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరి చయం వంటివి పెరిగే అవకాశం ఉంది. వీరి మాటకు, చేతకు సర్వత్రా విలువ పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అంచనాలకు మించిన ధనాభివృద్ధి ఉంటుంది. అయితే, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. టెన్షన్లకు అవకాశం ఉంటుంది. సుఖసంతోషాలు తగ్గుతాయి.
  5. వృశ్చికం: ఈ రాశ్యధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఎటువంటి ప్రయ త్నమైనా సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు, ఆర్థికంగా కూడా తప్పకుండా అంచనా లకు మించిన పురోగతి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అయితే, బంధుమిత్రులతో, సహోద్యోగులతో విరోధాలు పెరుగుతాయి. వివాదాల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. కొన్ని దుస్సాహసాలకు ఒడికట్టి ఇబ్బంది పడడం జరుగుతుంది.
  6. కుంభం: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజుడు ఉచ్ఛపట్టడం వల్ల డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగం వారు, తదితరులు రాజయోగం అనుభవించే అవకాశం ఉంది. వీరు పట్టిందల్లా బంగారం అవు తుంది. సర్వత్రా వీరి ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి మాటకు, చేతకు తిరు గుండదు. వీరి సలహాలు, సూచనల వల్ల అధికారులు, ఇతరులు బాగా లాభపడతారు. అయితే, ఆర్థికంగా మోసపోవడం, నమ్మక ద్రోహం, వైద్య ఖర్చులు పెరగడం వల్ల బాగా ఆందోళన చెందుతారు.