Money Astrology
ప్రస్తుతం కుజ, శుక్రులు ఒకరికొకరు కేంద్ర స్థానాల్లో ఉన్నారు. శుక్రుడికి చెందిన వృషభ రాశిలో సంచారంచేస్తున్న కుజుడు చతుర్థ దృష్టితో సింహ రాశిలోని శుక్రుడిని వీక్షించడం జరుగుతోంది. ఈ రెండు గ్రహాలు పరస్పరం కేంద్రాల్లో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి స్త్రీ వ్యామోహంతో సహా ఏ వ్యామోహమైనా కాస్తంత అతిగా ఉంటుంది. ఈ నెల 19 తర్వాత శుక్రుడు సింహరాశి నుంచి నిష్క్రమిస్తున్నందువల్ల ఓ పదిహేను రోజుల పాటు కొందరి జీవితాల్లో విశేషమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, కుంభ రాశుల వారు సంపాదన పెంచుకోవడం మీద బాగా దృష్టి పెట్టే సూచనలున్నాయి.
- మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షిస్తున్నందువల్ల ఈ రాశివారు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, అటువంటి వ్యక్తితో పెళ్లి ఖాయం చేసుకోవడం గానీ జరిగే అవకాశం ఉంది. ఈ రాశివారిలో స్త్రీ వ్యామోహంతో పాటు వ్యస నాలు కూడా విజృంభించే అవకాశం ఉంది. ఆదాయం పెంచుకోవాలన్న ఏకైక లక్ష్యంతో అనేక ఆదాయ మార్గాలను ఎంచుకునే సూచనలున్నాయి. వీరికి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
- వృషభం: ఈ రాశిలో ఉన్న కుజుడు చతుర్థ స్థానంలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడిని వీక్షిస్తున్నందువల్ల, గృహ, వాహన సౌకర్యాలను అమర్చుకునేందుకు ఎక్కువగా శ్రమపడడం జరుగుతుంది. ఆస్తి పాస్తులకు సంబంధించిన సమస్యలను రాజీమార్గంలోనైనా పరిష్కరించుకోవడం జరుగుతుంది. సాధారణంగా స్త్రీలోలత్వం పెరుగుతుంది. ఉద్యోగాల్లో జీతభత్యాలు అంచనాలకు మించి పెరిగే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బహుశా లాభాలకు లోటుండకపోవచ్చు. ఆరోగ్యం బలపడుతుంది.
- సింహం: ఈ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడి మీద దశమ స్థానం నుంచి కుజుడి దృష్టి పడినందువల్ల ఉద్యోగంలో ప్రతిభాపాటవాలను, శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. హోదా పరంగా, జీతాలపరంగా సహోద్యోగులను మించిపోయే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదా యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి, సాధిస్తారు. స్త్రీలతో పరిచయాలు పెంపొందుతాయి. విలాస జీవితం అలవాటవుతుంది. దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత పెరిగే సూచనలున్నాయి.
- తుల: ఈ రాశ్యధిపతి శుక్రుడిపై కుజ దృష్టి పడడం వల్ల స్త్రీ సంబంధమైన స్నేహాలు ఎక్కువయ్యే అవ కాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. దాంతో పాటే విలాసాలు, వినోదాల మీద కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారం పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా జోరందుకుంటాయి.
- వృశ్చికం: ఈ రాశ్యధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షించడం వల్ల పదోన్నతి లేదా హోదా కోసం సహోద్యోగులతో తీవ్రంగా పోటీపడడం జరుగుతుంది. స్త్రీలతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. భూ క్రయ విక్రయాల్లో ఊహించని లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అత్యధి కంగా సంపాదించే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల బాగా లాభం పొందుతారు. నిరుద్యోగులకు కోరుకున్న ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న కుజుడు సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షిస్తున్నందువల్ల అప్రయత్నంగా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్త్రీ సంబంధమైన పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఎటువంటి పొర పచ్చాలున్నా సమసిపోతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది.