
Lord Shani Dev
జ్యోతిషశాస్త్రం ప్రకారం కుంభ రాశి ఒక మిస్టరీ రాశి. ఈ రాశివారు, ఈ లగ్నం వారు మార్మికంగా, అంతుబట్టని విధంగా వ్యవహరిస్తుంటారు. విచిత్రమేమిటంటే, ఇందులోని గ్రహాలు కూడా అంతు బట్టకుండా, అర్థం కాకుండా వ్యవహరిస్తుంటాయి. ప్రస్తుతం ఈ రాశిలో రాశ్యధిపతితో సహా మూడు గ్రహాలు సంచారం చేస్తున్నాయి. అంటే, శనీశ్వరుడు కాకుండా శుక్ర, రవులు లేదా కొద్ది రోజుల తర్వాత శుక్ర, కుజులు సంచరిస్తాయి. ఇందులో మూడు గ్రహాలు చేరిన కారణంగా మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, కుంభ రాశుల వారికి జీవితంలో ఊహించని సంఘటనలు, అనుకోని సంఘటనలు అనేకం జరుగుతాయి. అనుకోకుండా ఆదాయం పెరగడం, అనుకోకుండా వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం, ఊహించని విధంగా ఏదో ఒక శుభ యోగం పట్టడం వంటివి జరుగుతాయి.
- మేషం: ఈ రాశికి లాభ స్థానమైన కుంభ రాశిలో మూడు గ్రహాలు కలవడం వల్ల చాలా కాలంగా పెండింగులో ఉన్న ఆర్థిక, వ్యక్తిగత వ్యవహారాలు, సమస్యలు ఒక్కసారిగా చక్కబడతాయి. అను కోని కోణాల నుంచి లేదా మార్గాల నుంచి ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్న తులు, ఆదాయం పెరగడం వంటివి జరుగుతాయి. అంతే ఆశ్చర్యకంగా ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. వ్యాపారాల్లో అప్రయత్నంగా, అసంకల్పితంగా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి.
- వృషభం: ఈ రాశికి దశమ స్థానమైన కుంభరాశిలో మూడు గ్రహాలు కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా కొన్ని అనుకోని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అప్రయత్నంగా ఉద్యోగ లాభం ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. వ్యాపార జీవితం పరిస్థితి కూడా లాభాలపరంగా ఒక్కసారిగా మారిపోయే అవకాశముంటుంది.
- మిథునం: ఈ రాశికి తొమ్మిదవ స్థానమైన కుంభంలో మూడు గ్రహాలు సంచారం చేస్తున్నందువల్ల, విదేశాల నుంచి సైతం వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన ఆఫర్లు అందుతాయి. ఉన్నత విద్యలకు అవకా శాలు అందివస్తాయి. తండ్రి వైపు నుంచి అనుకోకుండా ఆస్తి సంక్రమిస్తుంది. పదిమందితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది. ఇష్టమైన వ్యక్తులు, చిన్ననాటి మిత్రులు తటస్థపడ తారు. ఇష్టమైన ప్రాంతాలకు వెడతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశ్చర్యకర ఫలితాలు వింటారు.
- సింహం: ఈ రాశికి సప్తమ రాశి అయిన కుంభంలో మూడు గ్రహాలు ఉండడం అనేక శుభ యోగాలను కలిగిస్తుంది. జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా కొత్త అనుభ వాలు ఎదురవుతాయి. కోరకుండానే వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఊహించని విధంగా మీ చుట్టూ వాతావరణం సానుకూలంగా మారిపోతుంది. నిరుపేదలు సైతం మంచి భాగ్యాన్ని అనుభవిస్తారు.
- తుల: ఈ రాశికి పంచమ స్థానంలో గ్రహ సంచారం ఎక్కువగా జరుగుతున్నందువల్ల సంభ్రమాశ్చర్యాలు కలిగే విధంగా ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఎటువంటి వ్యక్తిగత సమస్య లైనా పరిష్కారం అవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మారిపోతుంది.
- కుంభం: ఈ రాశిలో ఈ నెలాఖరు వరకు ఎప్పుడు చూసినా మూడు గ్రహాలు సంచరించడం వల్ల వ్యక్తిగత పరిస్థితులు, ప్రాధాన్యాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఈ మూడు గ్రహాల్లో ఒకటి రాశ్యధి పతి శనీశ్వరుడు అయినందువల్ల అనేక సానుకూల మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. ఎక్కువగా శుభ వార్తలు వినడం జరుగుతుంది. ఏది జరిగినా ఊహించని విధంగానే జరుగుతుంటుంది. ఆధ్యాత్మిక చింతన కొత్త పుంతలు తొక్కుతుంది. ఆదాయం బాగా కలిసి వస్తుంది.