Karkataka Rasi Ugadi Horoscope 2023
Image Credit source: TV9 Telugu
తెలుగువారి కొత్స సంవత్సరాదినే ఉగాది అని అంటారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బుధవారం (మార్చి 22) నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది. అదేవిధంగా, అక్టోబర్ 24న మీనరాశిలో రాహు సంచారం కన్యారాశిలో కేతువు సంచారం ప్రారంభం అవుతుంది. శని గ్రహం ఈ ఏడాదంతా కుంభ రాశిలో కొనసాగుతుంది. మిగిలిన గ్రహాలు సుమారుగా నెలరోజులు చొప్పున వివిధ రాశుల్లో సంచరించడం జరుగుతుంది. గ్రహాల సంచారం ఆధారంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర కాలంలో కర్కాటక రాశి వారికి జ్యోతిష్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.
కర్కాటక రాశి (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం 11, వ్యయం 8 | రాజపూజ్యం 5, అవమానం 4
ఈ ఏడాది శని అష్టమంలోనూ, గురువు, రాహువులు దశమంలోనూ, కేతువు చతుర్ధం లోనూ సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను అనుభవించడం జరుగు తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కష్టపడటం వల్ల కొద్దిపాటి ఫలితం ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసు ఒకటి సానుకూలపడే అవకాశం ఉంది. దాయాదులతో వివాదాలు కొనసాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. అడపాదడపా ఆరోగ్యం చికాకు కలిగిస్తుంది.
చాలాకాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ప్రతి చిన్న పనికి పెద్ద ప్రయత్నం అవసరం అవుతుంది. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది కాదు. మితిమీరిన ఔదార్యం కారణంగా ఇబ్బందులు పడతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే అది ఒక పట్టాన తిరిగి రాదు. బంధువులతో సమస్యలు తలెత్తుతాయి. వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది. ఆస్తి వివాదం ఒకటి వాయిదా పడుతూ ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
జూలై అనుకూల సమయం
నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. జూలై తరువాత వీరికి వృత్తి వ్యాపారాలపరంగా బాగా కలిసి వస్తుంది. వివాదాలకు, విభేదాలకు దూరంగా ఉండటం మంచిది.
అష్టమ శనితో సమస్య..
ఆశ్రేష నక్షత్రం వారి కంటే పుష్యమి నక్షత్రం వారికి మరింత బాగుండవచ్చు. అష్టమ శని కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. తరచూ వినాయకుడిని ప్రార్థించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..