Guru Dev: ప్రతికూల స్థానంలో గురువు సంచారంతో ఆ రాశుల వారు జాగ్రత్త.. వారికి వృత్తి, ఉద్యోగాల్లో స్తంభించి పోయే అవకాశం..!

| Edited By: Janardhan Veluru

Nov 23, 2023 | 6:47 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం గురువు ఒక శుభ గ్రహం. జాతక చక్రంలో గురువు సరైన స్థానాలలో ఉన్నప్పుడు ఆ జాతకుడి జీవితం బ్రహ్మాండంగా సాగిపోతుంది. గురువు ఏమాత్రం బలహీనపడినా ఆ జాతకుడు పురోగతి చెందడం చాలావరకు కష్టమవుతుంది. గురువు గ్రహసంచారంలో కూడా అనుకూల ప్రదేశాల్లో ఉంటే ధన కనక వస్తు వాహనాలను, సుఖ సంతోషాలను సమకూరుస్తాడు. ప్రతికూల స్థానాలలో ఉన్న పక్షంలో ఇబ్బందులు కలగజేస్తాడు.

Guru Dev: ప్రతికూల స్థానంలో గురువు సంచారంతో ఆ రాశుల వారు జాగ్రత్త.. వారికి వృత్తి, ఉద్యోగాల్లో స్తంభించి పోయే అవకాశం..!
Jupiter Transit
Follow us on

జ్యోతిషశాస్త్రం ప్రకారం గురువు ఒక శుభ గ్రహం. జాతక చక్రంలో గురువు సరైన స్థానాలలో ఉన్నప్పుడు ఆ జాతకుడి జీవితం బ్రహ్మాండంగా సాగిపోతుంది. గురువు ఏమాత్రం బలహీనపడినా ఆ జాతకుడు పురోగతి చెందడం చాలావరకు కష్టమవుతుంది. గురువు గ్రహసంచారంలో కూడా అనుకూల ప్రదేశాల్లో ఉంటే ధన కనక వస్తు వాహనాలను, సుఖ సంతోషాలను సమకూరుస్తాడు. ప్రతికూల స్థానాలలో ఉన్న పక్షంలో ఇబ్బందులు కలగజేస్తాడు. మొత్తం మీద ఈ గురువు గ్రహ సంచారంలో 1,2,5,7,9,11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు తప్పకుండా శుభ ఫలితాలిస్తాడు. అయితే, 3,4,6,8,10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కొద్దిగానైనా ప్రతికూల ఫలితాలనివ్వడం జరుగుతుంది. దీని ప్రకారం చూస్తే, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.

  1. వృషభం: ధన కారకుడైన గురువు ఈ రాశివారికి వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. చేతిలో డబ్బు నిలవదు. గృహ, వాహన సౌకర్యాల కోసం ప్రయత్నిస్తున్న వారికి డబ్బు మంచి నీళ్లలా ఖర్చవుతుంది. పిల్లల్లో ఒకరు దూర ప్రాంతానికి చదువుల కోసమో, ఉద్యోగం కోసమో వెళ్లడం జరుగుతుంది. పిల్లలు ఇప్పటికే విదేశాలలో ఉంటున్న పక్షంలో వారి నుంచి ఆశించిన స్పందన, సమాచారం ఉండకపోవచ్చు. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది.
  2. కర్కాటకం: ఈ రాశివారికి గురువు దశమ స్థానంలో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ‘వెట్టి చాకిరీ’ ఎక్కు వగా ఉంటుంది. అధికారులు అతిగా ఉపయోగించుకోవడమో, అతిగా ఆధారపడడమో జరుగు తుంది. దీనివల్ల పనిభారం పెరిగి విశ్రాంతి కూడా కరువవుతుంది. రావలసిన ఒక పట్టాన చేతికి అందకపోవచ్చు. బదిలీలలకు అవకాశం ఉంటుంది. సామాజికంగా కూడా ఒకటి రెండు అవ మానాలు ఎదురు కావచ్చు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించకపోవచ్చు.
  3. కన్య: ఈ రాశివారికి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల అనుకున్నదొకటి, అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది. ఒక పట్టాన ఏ ప్రయత్నమూ కలిసి రాదు. జీవిత భాగస్వామిని అప్పుడప్పుడు అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. రావలసిన డబ్బు చేతికి అందదు. తీసుకునేవారే కానీ, ఇచ్చే వారుండరు. కష్టార్జితంలో అధిక భాగం వృథా అవుతుంటుంది. మంచి చేయబోయినా చెడు ఎదు రవుతుంది. మాటకు, చేతకు సంబంధం ఉండదు. ఒకటి రెండు దుర్వార్తలు చెవిన పడతాయి.
  4. వృశ్చికం: ఈ రాశివారికి గురువు ఆరవ రాశిలో సంచరించడం వల్ల రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడు తుంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. సహాయం తీసుకున్నవారు అవసర సమయాల్లో ముఖం చాటేస్తారు. కష్టపడ్డా ఫలితం ఉండదు. ఏ పని తలపెట్టినా వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కొందరు మిత్రులు శత్రువులుగా మారతారు. ఆర్థిక ప్రయత్నాలు బెడిసి కొడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిఫలం లేకుండా అదనపు బాధ్యతలు మోయవలసి వస్తుంది.
  5. మకరం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో గురు సంచారం వల్ల ఇంటా బయటా ఒత్తిళ్లు అధికమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగా ఉంటుంది. అధికారులు మీ పనితో ఒక పట్టాన సంతృప్తి చెందరు. వృత్తి, ఉద్యోగాల విషయంలో మనసులో కొద్దిపాటి ఆందోళన ఉంటుంది. అధికారులే కాక, బంధుమిత్రులు సైతం అవసరానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. కుటుంబంలో మధ్య మధ్య అశాంతి ఏర్పడవచ్చు. మనశ్శాంతి తగ్గవచ్చు. మంచి చేయబోయినా చెడు ఎదురు కావచ్చు.
  6. కుంభం: ఈ రాశివారికి గురువు తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో స్తంభించి పోయే అవకాశం ఉంటుంది. సోదరులతో సఖ్యత, సామరస్యం తగ్గిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధించకపోగా, విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా ఆశించిన స్థాయిలో సఫలం అయ్యే అవకాశం ఉండదు. బంధుమిత్రులు, ఇరుగుపొరుగుతో అపార్థాలు తలెత్త వచ్చు.

ముఖ్యమైన పరిహారాలు

గ్రహ సంచారంలో గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎక్కువగా విష్ణు సహస్ర నామం పారాయణం చేయడం, వినాయకుడు, దత్తాత్రేయ స్వామిని పూజించడం వంటివి చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు బాగా తగ్గిపోతాయి. ప్రతికూల స్థానంలో గురువు సంచరిస్తున్నంత కాలం పుష్యరాగం పొదిగిన ఉంగరం ధరించడం కూడా మంచిది. గురువు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఇతర గ్రహాలు అనుకూల స్థానాల్లో ఉండడం వల్ల గురువు ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. గురువులు, గురుతుల్యులైన వారిని పూజించడం లేదా సత్కరించడం వల్ల కూడా గురువు ప్రతికూల ఫలితాలు తగ్గే అవకాశం ఉంటుంది.