Jupiter Transit 2025: గురువు మారితే ఆ రాశుల వారికి సమస్యలే..! చిన్నపాటి పరిహారాలతో ఉపశమనం

Guru Gochar 2025: మే 25 నుండి గురువు మిథున రాశిలో సంచరించడం వల్ల మేషం, కర్కాటకం సహా మరికొన్ని రాశుల వారు ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ రాశుల వారు గురువును ప్రసన్నం చేసుకునేందుకు చిన్నపాటి పరిహారాలు చేస్తే చాలు. గురువులను గౌరవించడం, ధార్మిక గ్రంథాలు చదవడం, దానధర్మాలు చేయడం వంటి పరిహారాలను అనుసరించి గురు గ్రహం ఆశీస్సులు పొందొచ్చు.

Jupiter Transit 2025: గురువు మారితే ఆ రాశుల వారికి సమస్యలే..! చిన్నపాటి పరిహారాలతో ఉపశమనం
Guru Grah Gochar

Edited By: Janardhan Veluru

Updated on: Apr 18, 2025 | 12:13 PM

జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ గురువు అనుకూలంగా లేకపోతే అత్యధికంగా కష్టనష్టాలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. మే 25 నుంచి గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్న సందర్భంగా కొన్ని రాశులు ఎక్కువగా ప్రతికూల ఫలితాలు అనుభవించే అవకాశం ఉంది. దేవ గురువు అయిన గురు గ్రహాన్ని ప్రసన్నుడిని చేసుకోవడానికి, శాంతింపజేయడానికి ఈ రాశుల వారు తప్పకుండా పరిహారాలు పాటించడం మంచిది. మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధన కారకుడు, అదృష్ట కారకుడు అయిన గురువు కొన్ని పరిహారాలకు తేలికగా లొంగిపోతాడు.

  1. మేషం: ఈ రాశికి గురువు తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల పురోగతి స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. తృతీయ స్థానంలో గురువు అత్యంత బలహీనుడవుతాడు. ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు. ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో సరైన గుర్తింపు లభించకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు కూడా మందగిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఎక్కువగా స్థిరత్వానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది.
  2. కర్కాటకం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో గురువు సంచారం వల్ల చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్ప డుతుంది. కష్టానికి తగ్గ ఫలితం అందకపోవచ్చు. ప్రతి పనిలోనూ వ్యయప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొందరు బంధుమిత్రుల వల్ల నష్టపోవడం జరుగుతుంది. సంతానం కలగకపోవచ్చు. శుభకార్యాలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
  3. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో గురు సంచారం వృత్తి, ఉద్యోగాలకు ఏమాత్రం అనుకూలం కాదు. ఉద్యో గంలో భారీ లక్ష్యాలతో అవస్థలు పడాల్సి ఉంటుంది. పని ఒత్తిడితో విశ్రాంతి లభించకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవు తారు. అనవసర పరిచయాలతో ఇబ్బంది పడతారు. ఆదాయానికి గండి పడుతుంది. శుభ కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు చిన్న ఉద్యోగంతో సంతృప్తి పడాల్సి వస్తుంది.
  4. వృశ్చికం: ఈ రాశికి గురువు అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఎక్కువగా నష్ట పోవడం, మోసపోవడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపో వచ్చు. సంతానం కలిగే అవకాశం ఉండదు. శుభ కార్యాలు వాయిదా పడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి విమర్శలు, వేధింపులు, ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. ఆస్తి వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి. పురోగతి నిలిచిపోతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.
  5. మకరం: ఈ రాశికి గురువు ఆరవ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల శుభ ఫలితాలు తగ్గిపోతాయి. ఆదాయం తగ్గే అవకాశం ఉంది. తరచూ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి, ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందకపోవచ్చు. ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి. సంతానం కలగడానికి అవకాశం ఉండదు. శుభ కార్యాల్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. కుటుంబం మీద ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
  6. మీనం: ఈ రాశికి రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఈ రాశివారికి గురువు చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల సుఖ సంతోషాలకు భంగం ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు నత్తనడక నడుస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా తగ్గుతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా వెనుకబడే అవకాశం ఉంది. విద్యార్థుల చదువులకు కూడా విఘ్నాలు ఏర్పడతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగకపో వచ్చు.

ముఖ్యమైన పరిహారాలు

గురువును అనుకూలంగా మార్చుకోవడం, ప్రసన్నుడిని చేసుకోవడం చాలా తేలిక. కొద్దిపాటి పరి హారాలు, శాంతులతో గురువు సంతృప్తి చెంది అనుకూల ఫలితాలనిస్తాడని, అదృష్టాలు కలిగిస్తా డని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. 1. మంత్రోపదేశం చేసిన గురువులను, పాఠాలు చెప్పిన టీచర్లను, బుద్ధులు, సుద్దులు చెప్పిన పెద్దలను, తల్లితండ్రులను గౌరవించడం వల్ల గురువు అనుగ్రహం పొందుతారు. 2. సుందరకాండ, భగవద్గీత, విష్ణు సహస్ర నామ స్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం, యోగులు, సర్వసంగ పరిత్యాగులు తదితర ఆధ్యాత్మికవేత్తల చరిత్రలు పఠించడం వల్ల గురువు అనుగ్రహానికి పాత్రులవుతారు. 3. తెల్లని దుస్తులు, గోధుమ రంగు దుస్తులు ధరించడం వల్ల గురువు అనుకూలంగా మారడం జరుగుతుంది. ఉంగరంలో పుష్య రాగం లేదా కనక పుష్యరాగం అనే రాయిని ధరించడం మంచిది. 4. కొద్దిమందికైనా అన్నదానం, వస్త్ర దానం చేయడం వల్ల చెడు ఫలితాలు తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయి.