Astro Tips: రాబోయే 7 నెలల పాటు ఈ రాశులవారికి తీవ్ర ఇబ్బందులు.. కారణం ఏమిటంటే..?

శతభిషా నక్షత్రం మలితొలి పాదాలకు అధిపతి బృహస్పతి. శనిని శతభిషా నక్షత్ర రెండో, మూడో పాదానికి అధిపతిగా జ్యోతిష్యశాస్త్రంలో..

Astro Tips: రాబోయే 7 నెలల పాటు ఈ రాశులవారికి తీవ్ర ఇబ్బందులు.. కారణం ఏమిటంటే..?
Jupiter Saturn Inauspicious Conjunction

Updated on: Mar 20, 2023 | 5:16 PM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక రాశిచక్రంలోని 12 రాశులపై కూడా ప్రభావం చూపుతుంది. అలాగే ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ క్రమంలోనే శనిగ్రహం ఇటీవలే శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించింది. శతభిషా నక్షత్రం మలితొలి పాదాలకు అధిపతి బృహస్పతి. శనిని శతభిషా నక్షత్ర రెండో, మూడో పాదానికి అధిపతిగా జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొంటారు. ఇక అక్టోబరు 17 వరకు శనిగ్రహం.. శతభిషా నక్షత్రం మొదటి పాదంలో ఉండబోతుంది. ఫలితంగా అక్టోబర్ 17 వరకు రాశిచక్రమంలోని ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేమిటంటే..

మీనరాశి: శతభిషా నక్షత్రంలో శనిగ్రహ సంచారం మీన రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాక మీనరాశివారు అక్టోబర్ వరకు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవలసిన పరస్థితి కలగవచ్చు. ఇంకా ఈ సమయంలో మీనరాశి వారు తమ డబ్బును దుబారా ఖర్చులకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫలితంగా ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటారు. అంతకాక ఈ 7 నెలల సమయంలో ఏదైనా పని లేదా వ్యాపారాన్ని ప్రారంభించడాన్ని ఈ రాశివారు మానుకోవాలి. ఈ సమయంలో శనిదేవుడి ముందు ఆవనూనె దీపం వెలిగించడం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: శని దేవుడి రాశిలో మార్పు కర్కాటక రాశి వారి జీవితాలపై కూడా అననుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశివారి ఆరోగ్యం చెడిపోయే  అవకాశం ఉంది. ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది. ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశివారు ఎలాంటి డీల్ కుదుర్చుకోకపోవడమే మంచిది. శనివారం నాడు శని దేవుడికి ఆవాల నూనె సమర్పించడం ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వృశ్చిక రాశి: శని నక్షత్రం మార్పు వృశ్చికరాశి వారికి కూడా హానికరం. ఈ సమయంలో మీరు ఆస్తి సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మిమ్మల్ని అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి లేకుంటే ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..