
Job Astrology
కుజుడు మేషంలో సంచారం చేస్తుండడంతో పాటు ఒక్క కేతువు మినహా మిగిలిన ఎనిమిది గ్రహాలు జాతక చక్రంలోని పైభాగంలోనే సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరు రాశులవారి ఉద్యోగ జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకునే సూచనలున్నాయి. ఈ పరిస్థితి మరో రెండు నెలల పాటు, అంటే ఆగస్టు మధ్య వరకూ కొనసాగే అవకాశం ఉంది. రాశులను బట్టి నిరుద్యోగులకు విదేశాల్లో, దూర ప్రాంతంలో, సొంత ఊర్లో తప్పకుండా ఉద్యోగం లభించడం జరుగుతుంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఉద్యోగపరంగా అనుకూలతలు బాగా పెరుగుతాయి.
- మేషం: ఈ రాశి వారికి ఉద్యోగంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉద్యోగం ప్రయత్ని స్తున్నవారు, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాలనుకున్నవారు సానుకూల సమాచారం అందుకుంటారు. ఈ రాశికి చెందిన నిరుద్యోగులు ఎక్కువగా దూర ప్రాంతాల్లోనూ లేదా విదేశాల్లోనూ ఉద్యో గాల కోసం ప్రయత్నించడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నవారు ఇష్టమైన ప్రాంతా లకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.
- మిథునం: ఈ రాశికి రాశ్యధిపతి బుధుడితో పాటు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల సాధారణంగా దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. స్వస్థలాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఏర్పడు తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అతి చిన్న ప్రయత్నమైనా ఆశించిన ఫలితాన్నిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కూడా కొద్ది ప్రయత్నంతో పురోభివృద్ధి చెందుతాయి.
- సింహం: ఈ రాశికి దాదాపు ప్రతి గ్రహమూ అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగపరంగా మహా యోగాలు పట్టే అవకాశం ఉంది. సాధారణంగా సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరించడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలకు ప్రయాణాలు, పర్యటనలు చేయవలసి వస్తుంది. ఉద్యో గంలో అంచనాలకు మించి హోదా పెరిగే సూచనలున్నాయి. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి.
- తుల: ఈ రాశివారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల సాధారణంగా విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి అనేక విధాలుగా స్థిరత్వం లభి స్తుంది. కొద్ది ప్రయత్నంతో అంచనాలకు మించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలకు కూడా విదేశీ సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
- ధనుస్సు: ఈ రాశివారికి రాశ్యధిపతి గురువుతో పాటు శుభ గ్రహాలన్నీ అనుకూలంగా మారినందువల్ల, దూర ప్రాంతాల్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పదోన్నతులకు, జీతభత్యాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల్లో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
- కుంభం: ఈ రాశివారికి గ్రహ బలం పెరిగినందువల్ల ఉద్యోగ జీవితానికి సంబంధించి మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైన నైపుణ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది.