Horoscope Today: మనిషి జీవితంలో జరిగే మార్పులు వారి రాశి చక్రంపై ఆధారపడి ఉంటుందని నమ్మేవారు ఎంతో మంది ఉంటారు. ఈ క్రమంలోనే రాశి ఫలాల ఆధారంగా కార్యక్రమాలు చేపడుతుంటారు. మరి గురువారం మీ రాశి ఫలం ఎలాఉందో ఓసారి తెలుసుకోండి.
మేష రాశి వారు ఈరోజు చేపట్టిన ఆసక్మిక ప్రయాణాలకు సంబంధించి సమీక్షలు చేపట్టడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కొంత ప్రశాంతతను కలగజేస్తుంది. దేవీ ఆరాధాన ఈ రాశి వారికి మంచి ప్రయోజనాలను కలగజేస్తుంది.
ఈ రాశి వారు ఉద్యోగాది విషయాల్లో ఏర్పరుచుకున్న ప్రణాళికల్లో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తతతో ఉండడం మంచిది. లక్ష్మీనారాయణ సేవలో పాల్గొనడం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మిథున రాశి వారికి నూతన పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వీరు ఈ రోజు శుభవార్తలు వింటారు. దుర్గా సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.
ఈ రాశి వారికి మిత్రులతో విభేధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. శ్రీ రాజ రాశేశ్వరి అర్చన మేలు చేస్తుంది.
సింహ రాశి వారికి వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఉన్న చికాకులు తొలగిపోతాయి. లలితా సహస్త్ర నామ పారాయణం మేలు చేస్తుంది.
ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. మహా లక్ష్మీ అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.
తులా రాశి వారికి రావాల్సిన బాకీలు వసూళు అవుతాయి. దైవ దర్శనలు శుభ ఫలితాలను అందిస్తాయి. ఆహార, విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గణపతి అర్చన, దర్శనం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి వారికి వ్యాపరంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగాది విషయాల్లో మీ అంచనాలు నిజమయ్యే అవకాశాలున్నాయి. పేదలకు అన్నవస్త్రాలు దానం చేసుకుంటే ఈ రాశి వారికి మంచి జరుగుతుంది.
ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఉద్యోగాది విషయాల్లో మార్పులకు కొంత అవకాశం కనిపిస్తుంది. శ్రీ రాజమాతంగి నమః అనే నామస్మరణ మేలు చేస్తుంది.
మకర రాశి వార ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. ఉద్యోగాది విషయాల్లో చికాకులు కనిపిస్తున్నాయి. గణపతికి గరికను సమర్పించుకుంటే మేలు జరుగుతుంది.
ఈ రాశి వారుఈరోజు ధార్మికపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. స్థిర, చరాస్తి క్రయ విక్రయాల్లలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శ్రీరామ నామ స్మరణ మేలు చేస్తుంది.
మీన రాశి వారు సన్నిహితులతో వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. శివారాధణ మేలు చేస్తుంది.
Also Read: sirivennela seetharama sastry: సినీ వినీలాకాశంలో ఆయన సిరివెన్నెల.. సాహో… సీతారామ శాస్త్రి
పాదాలకు బంగారు ఆభరణాలు ఎందుకు ధరించకూడదో మీకు తెలుసా.. శాస్త్రం ఏం చెబుతుందంటే..
Vastu Tips: మీ ఇంట్లో ఈ పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి… ఈ వస్తువులు ఉంటే మీకు ఇబ్బందులు తప్పవు..