Horoscope Today: ఈ రాశివారికి బంధువులతో విబేధాలు వచ్చే అవకాశం ఉంది.. ఖర్చులు కూడా పెరుగుతాయి…

|

May 19, 2021 | 7:57 AM

కొందరు జీవితాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని ముందు సాగుతుంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతుంటారు...

Horoscope Today: ఈ రాశివారికి బంధువులతో విబేధాలు వచ్చే అవకాశం ఉంది.. ఖర్చులు కూడా పెరుగుతాయి...
Today Rashiphalalu
Follow us on

Horoscope Today: కొందరు జీవితాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని ముందు సాగుతుంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతుంటారు. మరి కొందరు జీవితాలను పెద్దగా పట్టించుకుని ఉండరు. ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్నది సాధించే వరకు ముందుకు సాగితే జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుంది. అయితే బుధవారం  వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.

మేషరాశి

ఈ రాశివారు పరిచయాలు పంచుకునే పనులు చేస్తుంటారు. క్రయ విక్రయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పేదవారికి కాయగూరలు దానం చేయడం మంచింది.

వృషభరాశి

ఈ రాశివారు ఈ రోజు నూతన పనులను ప్రారంభించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్ధిక లావాదేవీలకు అనుకూలంగా ఉండబోతుంది. గణపతి పూజ మేలు చేస్తుంది.

మిధున రాశి:

ఈ రాశివారు ధార్మికమైన పనుల్లో పాల్గొంటూ ఉంటారు. ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. నారాయణ ఆశాక్షరి స్తోత్రం మేలు చేస్తుంది.

కర్కాటకరాశి

ఈ రాశివారికి ఈ రోజు బంధువులతో వ్యవహరించే సందర్భంలో స్వల్ప ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. హనుమాన్ చాలీసా పారాయణం మంచింది.

సింహరాశి

ఈ రాశిగలవారు ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది, వ్యాపార ఉద్యోగాడి విషయాల్లో ముందడుగు వేస్తారు. పేదవారికి అన్నదానం చేయడం మంచింది.

కన్యరాశి

కన్యారాశివారికీ వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.

తులరాశి

ఈ రాశివారు ఈ రోజు శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపార ఉద్యోగ విషయాల్లో చికాకులు కలుగుతాయి. రాజమాతంగి నమః అనే స్తోత్రం మేలు చేస్తుంది.

వృశ్చికరాశి

ఈ రాశివారికి ఈ రోజు  చేసేపనుల్లో ఆలస్యాలు కాకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటాయి.

ధనుస్సురాశి

ఈ రాశివారికి ఈ రోజు ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. లలిత అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది.

మకరరాశి

ఈ రాశివారు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరులతో మాటపట్టింపులు చోటు చేసుకుంటుంటాయి. శివారాధన మేలు చేస్తుంది.

కుంభరాశి

ఈ రాశివారు ఈ రోజు ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. వస్తువు ధనలాభాలు సంతోషాన్ని కలుగజేస్తాయి. ఖర్చులు కూడా ఉంటాయి.

మీనరాశి

ఈ రాశివారికి చేపట్టినపనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆర్ధిక స్థితిగతులను మెరుగు పరుచ్చుకునే పనులు చేయడం మంచింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Israel war: ఇజ్రాయిల్..పాలస్తీనా యుద్ధం.. ప్రజల పరిస్థితి దయానీయం.. మంచినీరు కూడా కరువైపోయిన దుస్థితి!

Black fungus : అనంతపురం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం.. విషయం బయటకు పొక్కకుండా యంత్రాంగం జాగ్రత్తలు.!