Horoscope Today: ఈ రాశి వారికి ఆస్తి విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి

|

Jun 03, 2021 | 7:01 AM

Horoscope Today: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో..

Horoscope Today: ఈ రాశి వారికి ఆస్తి విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
Rashi Phalalu
Follow us on

Horoscope Today: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు గురువారం (జూన్ 3న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రాశివారు ఈ రోజు అనుకున్న పనులన్ని సకాలంలో పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే రుణ ప్రయత్నాలు కూడా కొనసాగుతుంటాయి. వీరికి హనుమాన్‌ చాలిసా పారాయణం ఎంతో మేలు చేస్తుంది.

వృషభరాశి

విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ, లక్ష్యాలు పెరుగుతూ ఉంటాయి. అయినా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గురుగ్రహ అర్చన మేలు చేస్తుంటుంది.

మిథున రాశి

ఈ రాశిగల వారికి పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా అనుకూలిస్తుంటాయి. పలు రకాల చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఎంతో మేలు చేస్తుంది.

కర్కాటక రాశి

వీరు ఆ రోజు ఆస్తి సంబంధిత అంశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. కొన్ని ఆశ్యర్యకరమైన సంరద్భాలు చోటు చేసుకుంటాయి. నవధాన్యాలతో నవగ్రహ అర్చన నిర్వహించుకోవడం మంచిది.

సింహరాశి

ఈ రాశివారు గతంలో తీసుకున్న అప్పులు భారం పెరుగుతుంటుంది. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు మేలు చేస్తుంది. శివార్చన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

కన్య రాశి

ఈ రాశివారు చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతుంటాయి. ఉద్యోగాల విషయంలో కొంత మేరకు మాత్రమే ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామికి ఎరుగు రంగు పుష్పాలతో అర్చన చేయడం మంచిది.

తులా రాశి

ఈ రాశివారికి శ్రమ అనేది ఫలించబోతోంది. అంతేకాకుండా వృత్తి, వ్యాపార పర భావనలు పెరిగే అవకాశాలున్నాయి. అష్టలక్ష్మి పారాయణం ఎంతో మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి

నూతన వ్యక్తులతో ఈ రోజు ఈ రాశివారికి పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. భూ సంబంధమైన విషయలలో పరిష్కారం చేసుకోగల్గుతారు. విష్ణు సహాస్ర నామ పారాయణం ఎంతో మేలు చేస్తుంటుంది.

ధనుస్సు రాశి

కుటుంబంలో కొన్ని సమస్యలు, చికాకులు ఉంటాయి ఆ రాశివారికి. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శ్రీరామ స్తోత్ర పారాయణం ఎంతో మేలు చేస్తుంది.

మకర రాశి

ఈ రాశివారికి కుటుంబంలో ఉన్నతమైన స్థానం లభిస్తుంటుంది. ఉద్యోగాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సూర్యాగ్రహ పారాయణం మేలు చేస్తుంటుంది.

కుంభ రాశి

ఈ రాశివారికి సన్నిహితులతో సఖ్యత ఉంటుంది. ఉద్యోగాల విషయాల్లో కొంత ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంటుంది. అయినప్పటికీ కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. గణపతి స్తోత్ర పారాయణం ఎంతో మేలు చేస్తుంటుంది.

మీన రాశి

ఈ రాశివారికి వ్యవహారిక విషయాల్లో కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. మహాలక్ష్మీ అమ్మవారికి తీపి పదార్థాలతో నివేదన చేయడం మంచిది.