Horoscope Today: ఈ రాశి వారు వాహనాల కొనుగోళ్ల విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.. స్నేహితులతో అవరోధాలు
Horoscope Today: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో..
Horoscope Today: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు శుక్రవారం (జూన్ 4న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశివారికి వృత్తి, వ్యాపార సంబంధిత విషయాలలో శుభవార్తలు వింటారు. వ్యాపారంలో రాణించే అవకాశం ఉంది. ఈ రాశివారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయడం ఎంతో మంచిది.
వృషభ రాశి
కొన్ని కుటుంబాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటాయి. కొనుగోలు, వస్తువుల కొనుగోలు, వ్యాపార సంబంధిత విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. మరిన్ని ఫలితాల కోసం ఆంజనేయ స్వామికి అర్చన చేయడం ఎంతో మంచిది.
మిథునరాశి
ఈ రాశివారు ఈ రోజు వాహన కొనుగోలు వంటి అంశాలలో కీలక మార్పుల చోటు చేసుకునే అవకాశంఉంది. వ్యాపార విషయాలలో కూడా రాణించే అవకాశం ఉంది. విశేషంగా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం ఎంతో మేలు చేస్తుంటుంది.
కర్కాటక రాశి
శ్రమ, వివిధ రకాల పనులలో అవంతరాలు ఏర్పడే అవకాశం ఉంది. ఏవైనా పనులు చేసే విషయంలో జాగ్రత్తలు పాటించడం ఎంతో మంచిది. ఈ రాశివారు శ్రీవేంకటేశ్వరస్వామి పారాయణం చేయడం ఎంతో మేలు చేస్తుంటుంది.
సింహరాశి
ఈ రాశివారు వ్యవహరిక విషయాలలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రుణ వ్యవహారాలు కొనసాగుతాయి. ఈ రాశివారు సూర్యనారాయణకు పూజ చేస్తే ఎంతో మంచిది.
కన్య రాశి
ఈ రాశివారు విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విష్ణుసహస్ర నామ పారాయణం చేయడం ఎంతో మేలు చేస్తుంటుంది.
తులా రాశి
ఈ రాశివారికి స్నేహితుల పట్టింపులు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా చోటు చేసుకుంటాయి. ఆంజనేయస్వామిరి అర్చన చేయడం ఎంతో మంచిది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. వ్యవహారక విషయాలలో ఆనందం పొందుతారు. విష్ణు పూజలు చేయడం ఎంతో మేలు చేస్తుంటుంది.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి ఈరోజు వ్యవహారిక విషయాలలో ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. ఏవైనా పనులు చేసే ముందు జాగ్రత్తగా ముందుకు వేయడం మంచిది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. పేదలకు అన్నదానం చేయడం ఎంతో మేలు చేస్తుంటుంది.
మకర రాశి
ఈ రాశివారు వాహనాల కొనుగోలు సంబంధిత విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన విషయాలు తెలుసకుంటారు. పనులు చేపట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. శ్రీరామ స్తోత్ర పారాయణం ఎంతో మేలు చేస్తుంటుంది.
కుంభ రాశి
ఈ రాశివారు వ్యవహారిక విషయాలలో అభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గణపతి ఆలయాన్ని దర్శించడం వల్ల ఎంతో మేలు చేస్తుంటుంది.
మీనరాశి
ఈ రాశివారు సోదరులతో విబేధాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇంద్రున్ని పూజించడం మంచిది.