Horoscope Today: ఈరాశుల వారు ఆర్థికంగా మెరుగుపడిన, ఖర్చులు పెరుగుతాయి… ఈరోజు రాశిఫలాలు..

|

Apr 26, 2021 | 8:02 AM

Horoscope Today on april 25th 2021: ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది.

Horoscope Today: ఈరాశుల వారు ఆర్థికంగా మెరుగుపడిన, ఖర్చులు పెరుగుతాయి... ఈరోజు రాశిఫలాలు..
Horoscope
Follow us on

Horoscope Today on april 25th 2021: ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. మరీ ఈరోజు (ఏప్రిల్ 26న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేషరాశి..

ఈరోజు వీరు ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, వ్యవహారిక విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రమణ్య స్వామి అర్చన మేలు చేస్తుంది.

వృషభరాశి..

ఈరోజు వీరు ఉద్యోగాల విషయాల్లో మంచి గుర్తింపు పొందుతారు. స్థీరాస్తి విషయం మంచి ఆలోచనలు చేస్తుంటారు. దక్షిణ మూర్తి స్వామి వారి ఆరాధన మేలు చేస్తుంది..

మిథున రాశి..

ఈరోజు వీరు రావాల్సిన బాకీలు వసూలు చేస్తుంటారు. వ్యాపార వ్యవహరిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. గౌరీ శంకరుల అర్చన మేలు చేస్తుంది.

కర్కాటక రాశి..

ఈరోజు వీరు శుభకార్యక్రమాల ప్రస్తావన చేస్తారు. కుటుంబసమ్మతమైన చర్చలు ఉంటాయి. నవగ్రహ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

సింహరాశి..

ఈరోజు ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. అనవసరమైన ప్రయాణాలు రద్ధు చేసుకోవడం మంచిది. నందీశ్వరుని దర్శనం మేలు చేస్తుంది.

కన్యరాశి..

ఈరోజు వీరు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విష్ణు సహస్ర స్త్రోత్ర పారాయణం, తులసి అర్చన మేలు చేస్తుంది.

తులారాశి..

ఈరోజు వీరికి గతంలో అవసరాల కోసం చేసిన అప్పులను తీర్చుతారు. ఆర్థిక ప్రగతి నెమ్మదిగా కలిసి వస్తుంది. మహలక్ష్మీ అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరికి వేరు వేరు రూపాల్లో రావాల్సిన బాకీలు ఆలస్యం కావడం వలన ఇతర అప్పులు చేస్తుంటారు. జాగ్రత్తలు తీసుకోవాలి. అంగారక గ్రహ అర్చన మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి..

ఈరోజు వీరికి స్నేహితుల సహకారాలు అందుతాయి. వేరు వేరు రూపాల్లో ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి. నృసింహ స్వామి దర్శనం చేసుకోవడం మంచిది.

మకర రాశి..

ఈరోజు వీరికి సాంఘికపరమైన కార్యక్రమాల్లో పాల్గోంటారు. ఇబ్బందికరమైన పరిస్థితులు, లేదా వ్యవహరాలను అధిగమిస్తారు. సంకటనష గణపతి స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభరాశి..

ఈరోజు ఆర్థిక పరిస్థితులు నెమ్మదిగా మెరుగవుతాయి. ఉహించని ఖర్చులు పెరుగుతాయి. దుర్గా అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

మీనరాశి..

ఈరోజు వీరికి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉత్సాహవంతమైన జీవనాలు ఉంటాయి. అర్చన, అమ్మవారి దర్శనం, మహలక్ష్మీ అమ్మవారి స్త్రోత్రపారాయణం మేలు చేస్తుంది.

Also Read: సుకన్య సమృద్ధి యోజన 2021: పోస్టాఫీసులో వడ్డీ రేట్లు చెక్ చేయండిలా.. ప్రయోజనాలెంటో తెలుసా..

UPI: యూపీఐ అంటే ఏమిటి..? దీని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి