
దిన ఫలాలు (అక్టోబర్ 28, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు, ఇతర రంగాలలోని వారికి కూడా పురోగతికి అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికర స్థాయిలో ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాల్లో మార్పు కోరుకునేవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలు, వ్యవహారాలు సఫలం అవుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): గురు, శనుల అనుకూలత వల్ల వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. ఇల్లు కొనడం మీద దృష్టి పెడతారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబంలో సుఖ సంతోషాలకు కొరత ఉండదు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా, అనుకూలంగా ఉంటుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా సానుకూల సమాచారం అందుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థికాభివృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. వ్యాపారాలు నిలక డగా కొనసాగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతలను సమర్థవంతంగా, సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పెరిగే సూచనలున్నాయి. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇంటా బయటా ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గేఅవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. కొన్ని ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కొద్దిపాటి ప్రయత్నంతో ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించవచ్చు. కొన్ని దైవకార్యాల్లో పాల్గొంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సాను కూలపడతాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, దాంతోపాటే విలాసాల ఖర్చులు కూడా పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన శుభ వార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు, ప్రయత్నాలను శ్రమతో పూర్తి చేస్తారు. వ్యయ ప్రయాసలతో తప్ప ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాదు. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. గృహ నిర్మాణ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1); వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు, జీతభత్యాలు పెరగడానికిఅవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు కానీ, తల్లి తండ్రులు కానీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితం బాగా బిజీ అయిపోతుంది. పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కొన్ని సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా సాగిపోతుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రయాణాలు, ఆహార, విహారాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం బాగా పెరుగుతుంది. విశ్రాంతి కరువవుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ఒకరిద్దరు బంధువులకు కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక చింతనతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహ కారాలుంటాయి. జీవిత భాగస్వామితో సానుకూలతలు పెరుగుతాయి. బంధువర్గంలో పెళ్లి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి బిజీగా సాగిపోతాయి.