
దిన ఫలాలు(నవంబర్ 16, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో ఇతరుల బాధ్యతల్ని కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగి పోతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబంలో బాధ్యతల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో పనితీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొన్ని ముఖ్య మైన పనుల విషయంలో తొందరపాటుతనంతో వ్యవహరించే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధి ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగాచక్కబడతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు చేపడతారు. ఇంటా బయటా మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహరాల్లో కల్పించుకోకపోవడం మంచిది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. సమర్థత, ప్రతిభా పాటవాలు వెలుగు లోకి వస్తాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి కానీ, కొద్దిగా శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. కొందరు సన్నిహితుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయడంలో శ్రమాధిక్యత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు తగ్గ రాబడి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఒకరిద్దరు బంధువుల్ని ఆదుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశముంది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
థనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. మీ సలహాలు, సూచనలను ఆదరిస్తారు. బంధుమిత్రులకు వీలైనంతగా సహాయపడతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపో తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. కుటుంబసమేతంగా ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆర్థిక విషయాల్లో కాస్తంత ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయ పరిస్థితి బాగా అను కూలంగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ, ప్రోత్సా హాలు పెరుగుతాయి. కొన్ని ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో కొద్ది లాభాలతో తృప్తిపడాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయట పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యాన్ని తగ్గించడం మంచిది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన ఆఫర్ అందుతుంది. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.