మేష రాశి..
వీరికి వివాహాది శుభకార్యాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబసభ్యులతో కలహాలు ఏర్పడతాయి.. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు.
వృషభ రాశి..
చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. రుణ ప్రయత్నాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి.
మిధున రాశి..
కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సాయం అందుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సరైన సమయంలో రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారికి సాయం అందుతుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.
కర్కాటక రాశి..
ఈరోజు వీరికి చేపట్టిన పనులలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తవారితో స్నేహం ఏర్పడుతుంది.
సింహరాశి..
ఈరోజు వీరికి చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. కుటుంబసభ్యుల మాటలకు విలువ ఇవ్వడం మంచిది. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.
కన్య రాశి..
వీరు బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి లభిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. చేపట్టిన పనులను తొందరగా పూర్తిచేస్తారు.
తుల రాశి..
సంఘంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు.
వృశ్చిక రాశి..
వీరు ఈరోజు ఆలోచించి తీసుకునే నిర్ణయం వలన విజయం సాధిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరికి బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు..
మకర రాశి..
ఈరోజు వీరికి ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ కలహాలు దూరమవుతాయి. అందరితో స్నేహంగా ఉండాలి.
కుంభ రాశి..
ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు.. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.
మీన రాశి..
ఈరోజు మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.