Horoscope Today: వీరు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో ఉండవు.. కొంచెం జాగ్రత్త.! సోమవారం రాశిఫలాలు ఇలా

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యక్తిగత కార్యకలాపాలు కూడా పెరిగిపోతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

Horoscope Today: వీరు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో ఉండవు.. కొంచెం జాగ్రత్త.! సోమవారం రాశిఫలాలు ఇలా
Daily Horoscope

Edited By:

Updated on: Mar 30, 2026 | 6:31 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యం, ఆదరణ బాగా పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి రాబడి పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగి, విస్తరణ గురించి ఆలోచిస్తారు. నిరుద్యోగులకు స్వదేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఆఫర్లు అందే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా షాపింగ్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. బరువు బాధ్యతలు పెరగడం వల్ల విశ్రాంతి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బిజీ అయిపోయే అవకాశం ఉంది. అవసరానికి డబ్బు అందుతుంది. డబ్బు ఇవ్వాల్సినవారు తీసుకు వచ్చి ఇస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి సమస్యేమీ ఉండదు. ఉద్యోగం మార డానికి ప్రయత్నాలు చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. మిత్రుల వల్ల ఒత్తిడి ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. ఆదాయానికి లోటుం డకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆర్థికపరంగా ముందుకు దూసుకుపోతాయి. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ తప్పకుండా కొద్దిపాటి పురోగతి ఉంటుంది. కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచన లతో పురోగమిస్తారు. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబ జీవితం సానుకూలంగా,సామరస్యంగా గడిచిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడు తుంది. వృత్తిపరంగా ముందడుగు వేయడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగం మారడానికి, ఉద్యోగంలో మార్పులు రావడానికి చేసే ప్రయత్నాలు చాలావరకు సాను కూలపడతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా సాగుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. వ్యాపారంలో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. బంధువుల రాకపోకలుంటాయి. ఒక శుభ కార్యం గురించి ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఇష్టమైన ఆలయాల సందర్శన చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు ఆశించినంతగా తగ్గు ముఖం పడతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలతో పాటు బాగా యాక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారాలు కూడా కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా కూడా విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. ఇంటికి బంధుమిత్రుల రాకపోక లుంటాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. కానీ, ఖర్చు బాగా పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగడం, సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. మీ ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మరింత మెరుగైన ఉద్యోగంలోకి  మారడా నికి ప్రయత్నాలు సాగిస్తారు. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆదాయం, ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా, సంతృప్తికరంగా సాగుతాయి. సొంత వ్యవహారాలు, పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాల్ని చక్కబెడతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా చాలా వరకు సంతృప్తికరంగా గడిచి పోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండక పోవచ్చు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పితృవర్గం నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ప్రభుత్వపరంగా లబ్ధి పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం సంపాదించుకుంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు మీ సమర్థతను గుర్తిస్తారు. ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు పెరుగుతాయి. వ్యాపారాలను విస్తరించే సూచనలున్నాయి. ఆదాయానికి లోటుండదు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో సంతోష దాయక  వాతావరణం నెలకొంటుంది. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. కొద్దిగా డబ్బు నష్టపోతారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యక్తిగత కార్యకలాపాలు కూడా పెరిగిపోతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు వేగంగా పూర్తవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులక కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆపర్లు వస్తాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి కొద్దిగా బయటపడడం జరుగుతుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆదాయా నికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఒకరిద్దరు స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.

Follow Us