జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి ఇలా..

Horoscope Today: జూన్ 12, 2026 శుక్రవారం రోజున గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి విశేష అనుకూల ఫలితాలను అందించనుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి, ఆర్థిక లాభాలు, అధికారుల సహకారం వంటి శుభ పరిణామాలు కనిపించనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి ఇలా..
Horoscope Today 12 June 2026

Edited By:

Updated on: Jun 12, 2026 | 6:00 AM

దిన ఫలాలు (జూన్ 12, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలతో పాటు ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో బరువు బాధ్యతలతో పాటు ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పిల్లలు చదువుల్లో మొదటి స్థానంలో ఉంటారు. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. శరీరానికి కొద్దిగా విశ్రాంతి అవసరమని గ్రహించండి. ఆదాయ వృద్థి ప్రయత్నాల మీద దృష్టి పెట్ట డం మంచిది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా చక్కబడుతుంది. ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. వ్యయ ప్రయాసలున్నప్పటికీ తలపెట్టిన పనులు, వ్యవహారాలన్నీ చాలావరకు పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనసు లోని కోరికల్లో ఒకటి రెండు అనుకోకుండా నెరవేరుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేపడతారు. కొన్ని ముఖ్యమైన పనులు, కార్యకలాపాలు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్ట డం అవసరం. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం వరకు ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాల్లో కొన్ని అనుకోని ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు, కార్యకలాపాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. ఆర్థిక వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తారు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించడం గానీ, ఉన్నత విద్యకు అవకాశం లభించడం గానీ జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. పనితీరుతో ఇంటా బయటా అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో కొద్దిగా చికాకులు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఒక మోస్తరుగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకున్నప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అంతకు మించి ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి పనులకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా చాలావరకు హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. కొందరు బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడడానికి కొత్త ప్రయత్నాలు చేపడతారు. కొద్దిపాటి శ్రమతో ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపా రాలు బాగా బిజీగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం కనిపిస్తోంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులు, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారంలో సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. అన్ని రంగాల ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం లభిస్తుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో, సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి కూడా శుభ వార్తలు అందుతాయి. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్యం మీద బాగా శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఇతరుల బాధ్యతలను తలకెత్తుకోవద్దు. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుని సమస్యను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలతో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారాల మీద పెట్టుబడులు పెంచడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా రావాల్సిన బకాయీలు కూడా వసూలవుతాయి. ముఖ్య మైన అవసరాలు తీరిపోతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు.

Follow Us