Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది… నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

|

Jan 16, 2022 | 6:29 AM

Horoscope Today (16-01-2022): ఈరోజు కనుమ పండగ. తమకు పంట పొలాల్లో చేదోడు వాదోడుగా ఉన్న పశువులను పూజిస్తూ జరుపుకునే పండగ కనుమ. చాలా మంది ఎటువంటి శుభకార్యాలు,..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది... నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Follow us on

Horoscope Today (16-01-2022): ఈరోజు కనుమ పండగ. తమకు పంట పొలాల్లో చేదోడు వాదోడుగా ఉన్న పశువులను పూజిస్తూ జరుపుకునే పండగ కనుమ. చాలా మంది ఎటువంటి శుభకార్యాలు, ప్రయాణాలు వంటి కార్యక్రమాలు మొదలు పెట్టాలంటే.. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 16వ తేదీ ) ఆదివారం (sun day) రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు  శుభవార్త వింటారు. బంధు మిత్రుల వలన మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు అనవసర విషయాలకు దూరంగా ఉండండి.. వివాదాలను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. అనుకోని విధంగా డబ్బులు చేతికి వస్తాయి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు అనుకూల ఫలితాలను అందుకుంటారు. మానసికంగా ఇబ్బంది పడతారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు అధిక శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది. వాదనలకు దూరంగా ఉండడం మంచిది. సహనంతో ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఏర్పడవచ్చు. నిదానంగా అన్ని వ్యవహారాలు చక్కబడతాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మానసికంగా సంతోషంగా ఉంటారు.  ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారు తమ  అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబలో సంతోషం నెలకొంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆత్మీయుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అధిక శ్రమ కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి ప్మైరారంభించిన పనులలో ఎన్నని ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు మానసిక దైర్యంతో ముందుకు అడుగు వేస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొత్తపనులను ప్రారంభిస్తూ.. ఉత్సాహంగా ముందుకు సాగుతారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక నిర్ణయాలను తీసుకునే ముందు పెద్దల సూచనలు తీసుకోవడం ఉత్తమం. అప్పులను తీరుస్తారు. ముందస్తు ప్రణాళికతో పనులను చేపడతారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. కొన్ని అనుకోని సంఘటనల వలన ఇబ్బంది ఏర్పడుతుంది. స్థిరమైన నిర్ణయాలను తీసుకోవడం వలన మేలు జరుగుతుంది.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో శుభ ఫలితాలను అందుకుంటారు. బంధు, మిత్రుల సంతోషంగా గడుపుతారు.

Note: రాశిఫలాలు అనేవి నమ్మకానికి సంబంధించినవి.. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు రాశిఫలాలు ఇవ్వడం జరిగింది.

Also Read:

: డోకిపర్రు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా కళ్యాణం.. హాజరైన చిరంజీవి, సురేఖ దంపతులు..

కారంచేడులో సోదరి పురంధేశ్వరి ఇంట్లో బాలకృష్ణ సంక్రాంతి సంబరాలు.. గుర్రం ఎక్కిన బాలయ్య, మోక్షజ్ఞ