
దిన ఫలాలు (జనవరి 1, 2026): మేష రాశి వారికి వృత్తి జీవితం సాఫీగా సాగిపోయే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. మిథున రాశి వారికి ఆర్థికంగా, ఆదాయపరంగా ఆశించిన పురోగతి సాధించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగ జీవితం బాగా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాల్ని సకాలంలో, సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆదాయం బాగా వృద్ది చెందే అవకాశం ఉంది.
ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. మిత్రుల్లో కొందరికి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. అనవసర పరిచయాలకు బాగా దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
ఆర్థికంగా, ఆదాయపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి మార్గం సుగమం అవుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే సూచనలున్నాయి. ఆస్తి వివాదం ఒకటి కొద్దిగా చికాకు పెడుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి.
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక సంబంధమైన ఒడిదుడుకుల నుంచి చాలావరకు బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్ని అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనడం జరుగుతుంది.
ఉద్యోగులకు అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. బాధ్యతలు మారడానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యాల్లో విరివిగా పాల్గొంటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సహచరులు, భాగస్వాముల నుంచి సహకారం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడండి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో సఫలమవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదు.
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉన్నతావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహకారం కూడా తీసుకోవడం మంచిది. విలాస జీవితం అనుభవించడం గానీ, విలాస వస్తువుల మీద ఖర్చు పెట్టడం గానీ జరుగుతుంది. అనవసర పరి చయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీల వల్ల లాభముంటుంది.
ఉద్యోగంలో మీ సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరానికి బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ప్రయాణాలలో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. సన్నిహితులతో సంప్రదించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
ఉద్యోగులకు అధికారులు కొన్ని అదనపు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ముఖ్యమైన పనుల మీద వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఇతరులతో మీ మనసులోని విషయాలు పంచు కోకపోవడం శ్రేయస్కరం. కుటుంబ వ్యవహారాలలో బంధువుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు.
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు కాస్తంత ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలున్నప్పటికీ, రాబడికి లోటుండదు. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. సొంత విషయాల మీద వీలైనంతగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతలను పంచుకునే ప్రయత్నం చేయవద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయ వృద్దికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఉన్నప్పటికీ సరైన ప్రతిఫలం పొందుతారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దిగవద్దు. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సి ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడతారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.