Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

May 21, 2022 | 6:25 AM

చాలా మంది రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఈరోజు ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తారు. తమ నామ నక్షత్రం, లేదా రాశి ఆధారంగా తమ దినఫలాలను ( Daily Horoscope)తెలుసుకోవాలని భావిస్తారు.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us on

Horoscope Today (21-May-2022): ఉద్యోగం, వ్యాపారస్థులు ఎవరైనా సరే.. చాలా మంది రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఈరోజు ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తారు. తమ నామ నక్షత్రం, లేదా రాశి ఆధారంగా తమ దినఫలాలను ( Daily Horoscope)తెలుసుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 21వ తేదీ) శనివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రారంభించిన పనులను ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక వ్యవహాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. ప్రణాళిక ప్రకారం ముందుకువెళ్తే.. విజయాన్ని సొంతం చేసుకుంటారు. కృషి కి తగ్గ ఫలితాలు లభిస్తాయి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు మానసిక బలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంది. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ఇతరులను కలుపుకుని వెళ్లడం వలన ఇబ్బందులు తగ్గుతాయి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలను అందుకుంటారు.  మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక విషయాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. మంచి పనులను చేపడతారు.  ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు కీలక విషయాలను ఆలస్యంగా నెరవేరుస్తారు. పెద్దలతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశి వారు కీలక వ్యవహారాల్లో దైర్యంగా వ్యవహరించి అందరితోనూ ప్రశంసలను అందుకుంటారు. మానసికంగా ఇబ్బంది పడే వార్తను వింటారు. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు  అనుకున్నది సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది. ప్రతిభకు తగిన ఫలితాలను అందుకుంటారు. మీ మీ రంగాల్లో పనులలో ఊహించిన ఫలితాలు అందుకుంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి సంతోషముగా ముందుకు వెళ్లారు. ఉత్సాహం కలిసే కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. పట్టుదలతో పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్సాహాన్ని ఇచ్చే వార్త వింటారు. చేపట్టిన పనులు సులభంగా పూర్తి చేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు.  బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది.  మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. విరోధులతో తక్కువగా మాట్లాడడం మంచిది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. అనవసర ధనవ్యయం చేయాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read :