మేషం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన మనసుకు బాధ కలిగిస్తుంది. కుటుంబంలో సమస్యలు తప్పవు. మంచి ఫలితాల కోసం గోసేవ చేస్తే బాగుంటుంది.
వృషభం
సమయస్ఫూర్తితో ముందుకు వెళతారు. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. నూతన కార్యక్రమాలు చేపడుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని పూజిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.
మిథునం
కీలక వ్యవహారాల్లో పెద్దల నిర్ణయం లాభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. బంధువులతో కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదేవతారాధన మాత్రం మానవద్దు.
కర్కాటకం
చేపట్టిన రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం అందుతుంది. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మేలు కలుగుతుంది.
సింహం
శ్రమాధిక్యం తప్పదు. కీలక వ్యవహారాలు, పనుల్లో బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శ్రీరామరక్షా స్తోత్రం జపిస్తే ఆపదలు తొలగిపోతాయి.
కన్య
కీలక పనుల్లో బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇష్ట దైవారాదన మాత్రం మర్చిపోవద్దు.
తుల
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. సమయస్ఫూర్తితో ముందుకు సాగుతారు. కీలకమైన పనులు పూర్తవుతాయి . ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
వృశ్చికం
కుటుంబ భాద్యతలు భుజానపడతాయి. కీలకమైన పనుల్లో జాప్యం జరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో అంచనాలు తప్పుతాయి. అజాగ్రత్త పనికి రాదు. ఆదిత్య హృదయం పఠించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.
ధనస్సు
భవిష్యత్ ప్రణాళికలు పక్కాగా అమలుచేస్తారు. మనసుకు ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో సహనం కోల్పోకూడదు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చంద్ర శ్లోకం జపిస్తే శుభం కలుగుతుంది.
మకరం
ఈరాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉన్నతాధికారులు సహకారం అందుతుంది. శ్రమాధిక్యం పెరగకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది.
కుంభం
అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అధికారుల సహకారం లాభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన మాత్రం మానవద్దు.
మీనం
చేపట్టిన పనుల్లో అలసట పెరుగుతుంది. అస్థిర ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. కీలక విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది.
NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.