మేషం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలహాలు రావచ్చు. నవగ్రహ స్తోత్రం పఠిస్తే మంచిది.
వృషభం
ఈరాశి వారికి శుభఘడియలు నడుస్తున్నాయి. కీలక వ్యవహారాల్లో తోటివారి సాయం అందుతుంది. విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అవసరానికి ధన సహాయం అందుతుంది. శనిధ్యానం జపించడం వల్ల మేలు జరుగుతుంది.
మిథునం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. అవసరానికి తగిన సాయం అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేస్తే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.
కర్కాటకం
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. చేపట్టే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి జపిస్తే మేలు చేకూరుతుంది.
సింహం
ఈరాశివారికి మంచి ఘడియలు నడుస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దగ్గరివారితో గొడవలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం పఠిస్తే మంచిది.
కన్య
మంచి పనులతో పేరు పొందుతారు. కీలక విషయాల్లో ముందడుగు వేస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మంచిది.
తుల
కీలక విషయాల్లో సానుకూల నిర్ణయాలు అందుకుంటారు. అనవసర విషయాలు, వ్యక్తుల పట్ల సమయం వృథా చేయకండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందుతారు.
వృశ్చికం
చేపట్టిన పనులలో విఘ్నాలు ఎదురువుతాయి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. సమయస్ఫూర్తితో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు పాటించడం మంచిది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. నవగ్రహ ధ్యానం పఠించాలి.
ధనస్సు
ఈరాశివారికి శుభకాలం నడుస్తోంది. మొదలు పెట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.
మకరం
అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలున్నాయి. సమయ పాలనతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. లక్ష్మీదేవిని దర్శించుకుంటే మేలు జరుగుతుంది.
కుంభం
వీరికి శుభకాలం. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందులు, వినోద, కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు పూర్తిచేయగలుగుతారు. ఇష్ట దైవారాధనను మాత్రం మానవద్దు.
మీనం
కీలక విషయాల్లో ముందుడుగు వేస్తారు. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సానుకూల ఫలితాలను సాధిస్తారు. పనితీరు పట్ల ప్రశంసలు అందుకుంటారు. గోవింద నామాలు పఠిస్తే మంచిది.
NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.