మేషం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక వార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. వృత్తి వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు.శివ నామస్మరణతో శుభం కలుగుతుంది.
వృషభం
ఈరాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులతో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్మీ అష్టోత్తరం పఠిస్తే మేలు చేకూరుతుంది.
మిథునం
కొందరి ప్రవర్తన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ధనవ్యయం పెరుగుతుంది. బద్ధకాన్ని వదిలించుకోవాలి. లలిత సహస్రనామాలు పఠిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.
కర్కాటకం
చేపట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. దుర్గాదేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.
సింహం
సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. సమాజంలో మంచి పేరు పొందుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మధ్యాహ్నం తరువాత అనుకూల సమయం ఉంది. ఇష్ట దైవారాధనను ఎట్టి పరిస్థితులలోనూ మానవద్దు.
కన్య
ఈరాశివారు అప్రమత్తంగా ఉండాలి. కీలక వ్యవహారాలు, పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. అయితే బంధువులతో అభిప్రాయబేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మేలు చేకూరుతుంది.
తుల
ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలి. అనుకున్న పనులు పూర్తి కావాలంటే బాగా కష్టపడాలి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కలిగే సూచనలు ఉన్నాయి. దుర్గాదేవిని పూజిస్తే మంచిది.
వృశ్చికం
ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కీలక పనులు పూర్తవుతాయి. విరోధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శివుడిని ఆరాధిస్తే మేలు చేకూరుతుంది.
ధనస్సు
ఎప్పటినుంచో చేయాలనుకున్న పనులు పూర్తవుతాయి. పనితీరుతో అందరి మెప్పు పొందుతారు. కీలక విషయాలు, పనుల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది.
మకరం
ఈరాశివారు అనుకున్న దానికంటే గొప్ప ఫలితాలను పొందుతారు. కుటుంబీకులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఒక శుభ వార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆదిత్యహృదయం పఠిస్తే మంచిది.
కుంభం
ఉన్నతాధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కీలక వ్యవహారాలు, పనుల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పరమేశ్వరుడిని పూజిస్తే మేలు చేకూరుతుంది.
మీనం
ఈరాశివారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇష్టదైవారాధన వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి